ఓకే ఫ్రేమ్ లో ఫ్యామిలీలతో తారక్, సుక్కు, వంశీ, నీల్.. స్పెషల్ ఏంటంటే..?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, సుకుమార్.. ఫ్యామిలీలతో కలిసి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ కూడా ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఫ్యాన్స్‌తో పాటు ఆడియ‌న్స్ అందరికి ఇవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. అయితే.. ఈ స్టార్ ఫామిలీస్ అన్ని ఒకే ఫ్రేమ్లో కనిపించడానికి ప్రధాన కారణం డైరెక్టర్ వంశీ పైడిపల్లి భార్య మాలిని.

మాలిని బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ స్టార్ సెలబ్రిటీస్ అంతా తమ ఫ్యామిలీతో కలిసి వచ్చే సందడి చేసినట్లు తెలుస్తుంది. ఇక.. ఈ పిక్స్ సుకుమార్ భార్య తబిత షేర్ చేస్తూ ఆనందం, నవ్వు, ప్రేమ అన్ని నిండిన ఒకే స్పెషల్ డే అదే మాలిని బర్త్డే. చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం.. ఇంకా చాలా ఉన్నాయి అంటూ త‌బిత తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది. ఇక తబిత ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే తెగ వైర‌ల్‌గా మారుతుంది.

ముఖ్యంగా ఈ ఫోటోలో తారక్ భార్య లక్ష్మీ ప్రణతి మెయిన్ ఎట్రాక్షన్ గా మారారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు ఫోటోలు చూసి తెగ మురిసిపోతున్నారు. పిక్ అదిరిపోయిందంటూ.. క్రేజీ ఫ్రెండ్షిప్ గోల్స్ అంటూ నెటిజ‌న్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా మ్యాడ్‌స్క్వేర్ సక్సెస్ మీట్‌లో తారక్ సందడి చేసిన సంగతి తెలిసిందే. తర్వాత సుకుమార్ తో కలిసి తారక రిలాక్స్ అవుతున్న పిక్ రివిల్ అయింది. ఇప్పుడు మాలిని బర్త్డే సెలబ్రేషన్స్ లో.. భార్యతో కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చాడు ఎన్టీఆర్. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా దూసుకుపోతున్నాడు తార‌క్‌.