టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ కొల్లగొట్టిన టాప్ 10 గ్లింప్స్ ఇవే..!

సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్‌ బ‌య‌ట‌కు వ‌చ్చిన అది నెటింట తెగ వైరల్‌గా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వారి సినిమాలకు సంబంధించిన చిన్న విషయాన్నైనా కచ్చితంగా తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. అలా.. ఇప్పటివరకు టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ సాధించిన టాప్ 8 గ్లింప్స్ వీడియోస్ లిస్ట్ తెగ ట్రెండ్ అవుతుంది. ఒకసారి ఆ సినిమాలేంటో చూద్దాం.

Speculation On OG Story | cinejosh.com

OG:
ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ డైరెక్షన్లో నటిస్తున్న మూవీ ఓజి. గ్లింప్స్‌.. 2023లో పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్‌ వీడియోకు ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 24 గంటల్లో 7 లక్షల 31 వేల లైక్స్ కొల్లగొట్టింది.

Bheemla Nayak - Wikipedia

భీమ్లా నాయక్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబోలో వ‌చ్చిన‌ మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాపై అన్ని భారీ అంచ‌నాలు నెలకొనడానికి కారణం ఈ గ్లింప్స్ అన‌డంలో సందేహం లేదు. ఈ వీడియోకి 24 గంటల్లోనే ఏకంగా 7 లక్షల 28 వేల లైక్స్ దక్కాయి.

It's official! Man of Masses NTR Jr's next titled “Devara”, check out the  actor's intense first look from the film here | Telugu Movie News - Times  of India

దేవర:
త్రిబుల్ ఆర్ తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ దేవర. ఇక ఈ సినిమా గ్లింప్స్ వీడియో అయితే 24 గంటల్లో 7లక్షల 5 వేల లైక్స్‌ను సాధించింది.

Kalki 2898 AD Glimpse | Prabhas | Amitabh Bachchan | Kamal Haasan | Deepika  | Nag Ashwin | June 27

కల్కి 2898 AD:
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ అశ్విన్ కాంబోలో తెర‌కెక్కి.. బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన‌ కల్కి వీడియో గ్లింప్స్ 24 గంటల్లో 6 లక్షల 64 వేల లైక్స్ ను సొంతం చేసుకుంది.

RRR (2022) - IMDb

RRR:
ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచి.. ఆస్కార్ దక్కించుకున్న ఆర్‌ఆర్ఆర్ సినిమా గ్లింప్స్‌ వీడియో కి 24 గంటల్లో 6 లక్షల 22 వేల లైక్స్ వచ్చాయి.

Pushpa 2': Makers busy shooting intense action scene for Allu Arjun-starrer

పుష్ప 2 ది రూల్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుక్కుమార్ కాంబోలో భారీ అంచనాలు నడుమ రిలీజై.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన పుష్ప 2 సినిమా 24 గంటల్లో 6 లక్షలు 5 వేల లైక్స్ ను దక్కించుకుంది.

Ustaad Bhagat Singh First Glimpse | Pawan Kalyan | Sreeleela | Harish  Shankar | Devi Sri Prasad

పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ 4 లక్షల 88వేల వ్యూస్‌తో 7వ స్థానంలో నిలవగా.. గ్లోబస్టార్ రామ్ చరణ్ పెద్ది ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటికే హైయెస్ట్ వ్యూస్ సాధించి సంచలనం సృష్టించిన పెద్ది గ్లింప్స్‌కు ఇప్పటికే 4 లక్షల 63 లైక్స్ ద‌క్కాయి.

Ram Charan gives shout out for Peddi First Shout | cinejosh.com