పెద్ది సినిమాలో ఆ యాక్షన్ హీరోనా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా సామి..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్లో పెద్ది సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై మొదటి నుంచే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే తాజాగా శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. విపరీతమైన హైప్‌ను నెలకొల్పాయి. మొత్తానికి ఈ సినిమాతో చరణ్ ఒక పెను ప్రభంజనం సృష్టించబోతున్నాడని నమ్మకం కేవలం అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అయితే.. ఈ సినిమా చూసి తెగ మురిసిపోతున్నారు. ఈ సినిమాలో చరణ్ గల్లి క్రికెటర్గా కనిపించనున్నాడు.

Peddi Glimpse: ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయాలి.. అదిరిపోయిన పెద్ది  గ్లింప్స్.. రామ్ చరణ్ క్రికెట్ షాట్, బీజీఎమ్ హైలెట్-ram charan peddi movie  glimpse released ar ...

ఈ క్ర‌మంలోనే మాస్‌ జాతరతో చరణ్ నట విశ్వరూపం మరోసారి చూడబోతున్నామని స్పష్టంగా అర్థమైంది. మరి సినిమాలో చరణ్ కి క్రికెట్ పై అంతగా అవగాహన ఉండదట.. కానీ పరిస్థితి రిత్య క్రికెట్ ఆడాల్సి వస్తుందని.. ఈ క్రమంలోనే చరణ్‌కు క్రికెట్ నేర్పించడానికి ఓ కోచ్‌ కూడా ఉంటాడంటూ తెలుస్తుంది. ఆయన కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాల‌కృష్ణ‌. ఎస్.. మీరు విన్నది కరెక్టే. బాలయ్యను ఈ క్యారెక్టర్ లో నటింపజేయాలని బుచ్చిబాబు సన్నా ప్లాన్ చేస్తున్నాడట.

Balakrishna and Ram Charan share an Affectionate moment at Sharwanand's  wedding reception. 🤩 . . #nbk #balakrishna #nandamuribalakrishna  #jaibalayya #bhagavanthkesari #ramcharan #megapowerstar #sharwanand  #RakshitaReddy #tollywood #gulteofficial

మరి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్లే బాలయ్య ఈ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.. లేదా వేచి చూడాలి. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే మాత్రం.. సినిమా పిక్స్ లెవెల్లో అంచనాలను నెలకొల్పుతుంది అనడంలో సందేహం లేదు. ఇక చరణ్, బాలయ్య మధ్యన ప్రస్తుతం మంచి సంబంధం నడుస్తుంది. ఈ క్రమంలోనే చరణ్ సినిమాకు బాలయ్య నో చెప్పే అవకాశం లేదని.. వారి కాంబో సినిమా పై కూడా ఇది మంచి ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది. ఇక ఇందులో బాలయ్య నటిస్తాడో లేదో ఫుల్ క్లారిటీ రావాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.