టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మకు తెలుగు ప్రేక్షకుల్లో పరిచయాలు అవసరం లేదు. 1975 నుంచి తెలుగులో వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ యాక్టివ్గా దూసుకుపోతున్న ఈమె.. ఐదు దశాబ్దాలు ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాణిస్తున్నారు. ఇప్పటికీ వచ్చిన.. ప్రతి అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకుండా దూసుకుపోతున్న అన్నపూర్ణమ్మ.. ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ టెలివిజన్ షో లో కనిపిస్తూ ఆడియన్స్‌ను తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటుంది అన్నపూర్ణమ్మ. కుర్ర ఆర్టిస్టులకు దీటుగా పంచులు వేస్తూ.. ప్రాశలతో అదరగొడుతుంది. ఏడుపదుల వయసులోనూ యాక్టివ్ గా ఉంటూ ఈ జనరేషన్ నటీనటులకు ఇన్స్పిరేషన్ గా నిలిచింది.
ఇక ఇండస్ట్రీలో నిండుతనంతో.. సాంప్రదాయబద్ధంగా మొదటి నుంచి ఇప్పటివరకు కూడా నటిస్తూనే రాణిస్తున్న అన్నపూర్ణమ్మ.. సినిమాలు, టీవీ షోలతో బిజీబిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ వర్ష యాంకర్ గా వ్యవహరిస్తున్న కిసిక్ టాక్ షోలో సందడి చేసింది. ఇందులో తన ఫ్యామిలీ సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇక ఫిలిం ఇండస్ట్రీలో కమిట్మెంట్ల భూతం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో కామెంట్లపై అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడున్న కాలంలో కమిట్మెంట్ల విషయంలో ఇబ్బందులు పడుతున్నారేమో.. కానీ ఎదుట ఆర్టిస్ట్ కు ఇష్టం లేకుండా ఎవరు కమిట్మెంట్ కోసం ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే లేవు.
కమిట్మెంట్ అడిగినప్పుడు మేము ఒప్పుకోమని తగేసి చెబితే.. ఎవ్వరు ఏమి చేయలేరు అంటూ చెప్పుకొచ్చింది. నటిమణులంతా గట్టి నిర్ణయం తీసుకుంటే.. కమిట్మెంట్ల గోల పూర్తిగా వదిలిపోతుందని.. కానీ ఇష్టంగానే కమిట్మెంట్లకు ఓకే చెప్తుంటే.. సమయం గడుపుతుంటే.. ఇంకా సమస్య ఎక్కడుందంటూ కామెంట్లు చేసింది. ఇప్పటివరకు అసలు అవగాహన ఉందో.. లేదో.. తెలియకుండానే కమిట్మెంట్లకు ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు ఇబ్బంది పెట్టినట్లు ఎలా అవుతుంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమ కాలంలో కమిట్మెంట్లు ఉండేవి కావని.. తుప్పల్లోకి వెళ్లడాలు లేవని.. మాకు ఇష్టమైన వ్యక్తులతో మేము పబ్లిక్ గానే కలిసి తిరిగే వాళ్ళం.. మా బంధం చాలా ప్యూర్ గా ఉండేది అంటూ వివరించింది. కమిట్మెంట్లకు నో చెబితే సరిపోతుందని.. అదే పెద్ద పరిష్కారం. ఎవరు తమను లాక్కెళ్ళే పరిస్థితులు లేవని వివరించింది. ప్రస్తుతం అన్నపూర్ణమ్మ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.