బన్నీ – చరణ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్, బడ్జెట్ డీటెయిల్స్ తెలిస్తే ఫ్యుజులు ఎగిరిపోతాయి..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు తెలుగు ఆడియన్సస్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకొని పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న ఈ ఇద్దరు హీరోల మధ్య గతంలో ఎంతో మంచి బాండింగ్ ఉండేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్యన వార్‌ జరుగుతుందని.. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్యన చిచ్చు చెలరేగిందంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్.. పాన్‌ ఇండియన్ ప్రాజెక్ట్ ను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్ఆర‌ట‌.

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. సినిమా బడ్జెట్ లెక్కలో తెలిస్తే ఆడియన్స్ కు ఫ్యుజ్‌లు ఎగిరిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి. నేషనల్ లెవెల్‌లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇమేజ్‌ని సంపాదించుకుని రాణిస్తున్న రాజమౌళి.. ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టుగా గరుడ అనే సబ్జెక్టు పై స్క్రిప్ట్ రెడీ చేశాడు జ‌క్క‌న‌. ఇద్దరు హీరోలు ఈ సినిమాలో కచ్చితంగా అవసరమని.. ఎప్పటినుంచో ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.

Ram Charan Comes Up With A Better Plan Than Allu Arjun!

అయితే బడ్జెట్ సెట్ కాక‌.. ఇప్పటివరకు దాన్ని పోస్ట్పోన్‌ చేసిన జక్కన్న.. టాలీవుడ్ మార్కెట్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో.. కచ్చితంగా ఈ ప్రాజెక్టును బడా స్టార్ హీరోలతో ప్లాన్ చేయాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, రామ్‌చరణ్ హీరోలుగా పెట్టి సినిమాలు రూపొందించడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.2000 కోట్ల భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాను వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న జక్కన్న.. ఈ సినిమాతో ఇంటర్నేషనల్ మార్కెట్ను టార్గెట్ చేశాడు. ఒకవేళ ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే మాత్రం.. ఇక జక్క‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అంచనాలు వేరే లెవెల్‌లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు రూ.2000 కోట్ల బడ్జెట్ కాదు రూ.3000 కోట్లు ఖర్చు చేసిన సినిమాకు వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేస్తున్నాడట. ఇక మూడు ఏళ్ల తర్వాత చరణ్ అల్లు అర్జున్ లతో కాల్ షీట్లు తీసుకుని జక్కన్న సినిమాను సెట్స్‌పైకి తీసుకు వస్తాడో.. లేదో.. వేచి చూడాలి.