టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాగా మల్లిడి వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంభర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు వశిష్ఠ. ఇంకా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కానుందా.. లేదా వేసవి సెలవులు పూర్తయిన తర్వాత రిలీజ్ అవుతుందా.. అన్నదానిపై క్లారిటీ లేదు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం విశ్వంభర పనులలో బిజీగా ఉన్న వశిష్ట.. ఈ సినిమా తర్వాత ఏ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడు అనే విషయం తెలుసుకోవాలని ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.
మొదటి సినిమా బింబిసారతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు వశిష్ట. ఈ క్రమంలోనే చిరంజీవి పిలిచి మరీ వశిష్టకు అవకాశం ఇచ్చాడు. ఇక వశిష్ట మూడవ సినిమా సంగతేంటి అంటే.. చిరు కాంపౌండ్ లోనే వశిష్టను మరో సినిమాకు కూడా లాక్ చేసినట్లు సమాచారం. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ తో తన మూడవ సినిమా చేయాల్సిందిగా చిరంజీవి వశిష్టను అడిగినట్లు సమాచారం. ఇక చిరంజీవి లాంటి టాలీవుడ్ పెద్దన్న అడిగితే ఎవరు మాత్రం కాదనగలరు. ఈ క్రమంలోనే వశిష్ట కూడా ఓకే చేసినట్లు సన్నిహిత వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. వైష్ణవ్ తేజ్ కూడా.. కొంతకాలంగా వరుస ఫ్లాపులను ఎదుర్కొంటున్నాడు.
ఉప్పెన తర్వాత ఆయనకు ఒక్క సరైనా బ్రేక్ కూడా రాలేదు. కొండపాలెం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయాయి. దీంతో వైష్ణవ్ నుంచి సినిమా రిలీజ్ అయి దాదాపు రెండేళ్లు అవుతుంది. సరైన స్టోరీ, డైరెక్టర్ దొరకకపోవడంతో వైష్ణవి ఇంటికే పరిమితమయ్యాడు. కథలు వింటున్నా నచ్చిన కథలు సెట్ కావడం లేదట. ఈ క్రమంలోనే వశిష్ట పై నమ్మకంతో మెగాస్టార్.. వైష్ణవ్ తేజ్4తో కూడా వశిష్ట సినిమా చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వశిష్ట మాత్రం ప్రస్తుతం నా వద్ద అతనికి సరిపడా స్టోరీ లేదని.. ఇప్పటికిప్పుడు కథ రాయడం కష్టం. దానికి కొంచెం సమయం కావాలని అడిగాడట. చిరంజీవి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ తెలియాల్సి ఉంది.