ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ.. యావత్ ప్రపంచమంతా మన దర్శకుల వైపే.. చూసేలా చేస్తుంది. ఈ క్రమంలోనే.. సార్ దర్శకులు కూడా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోస్ ఐతే.. వాళ్ళు నటించే ప్రతి సినిమాతోనూ పాన్ ఇండియాను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కేవలం నేషనల్ లెవెల్ లో కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్ తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా షేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే.. ఆయన డైరెక్టర్ అట్లీతో ఓ గొప్ప సినిమా తీయాలని ప్లాన్ లో ఉన్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక.. తాజాగా సన్ పిక్చర్ ఎక్స్ వేదికగా వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోని చూస్తే వీళ్ళ కాంబోలో రానున్న సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక.. ఈ సినిమా కథ కూడా డిఫరెంట్ గా రూపొందిందట. ఓ వ్యక్తి సూపర్ మాన్ గా మారి తనే కొన్ని రోబోలను తయారు చేయడం.. వాటితో పాటు కొన్ని జంతువులను కూడా క్రియేట్ చేసి ప్రపంచాన్ని నాశనం చేయడానికి చూసి దుష్టశక్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి చూశేలా స్టోరీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఏదేమైనా.. ఈ సినిమాతో అట్లీ, అల్లు అర్జున్ మరోసారి తమ సత్తా చాటుకుని భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నారు. వారు అనుకున్నది అనుకున్నట్లుగా రూపొందించగలిగి ఆడియన్స్‌ను మెప్పిస్తే చాలు.. ఇక సినిమా బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసి పడేస్తుంది అనడంలో సందేహం లేదు. లేకపోతే.. మాత్రం వీరికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక సినిమాకు దాదాపు 700 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నారట. ఇక.. త్వరలోనే ఏ సినిమా సెట్స్ పైకి రానిందని తెలుస్తుంది.