ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ మంగళవారం సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ చదువుతున్నస్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగడంతో ఒక చిన్నరి మరణించడంతో పాటు.. 15 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో మార్క్ శంకర్ కూడా ఒకరు. మార్క్ శంకర్ కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయి. కాగా పక్కనే ఉన్న భవన నిర్మాణ కార్మికులు వెంటనే స్పందించడంతో చిన్నారులకి ప్రమాద తీవ్రత తగ్గిందని పవన్ ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంత పర్యటన ముగించి పవన్ సింగపూర్ వెళ్లాడు.
ప్రస్తుతం మార్క్ ఆరోగ్యం నిలకడగా ఉందట. కాగా.. ఊపిరి తిత్తుల్లోకి పొగ వెళ్లడంతో శ్వాస సమస్యలు ఏర్పడాయి. మార్క్ తాజా హెల్త్ అప్డేట్ ఏంటంటే.. హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్ని మార్క్‌ను చూశాడు. ఇక అత్యవసర వార్డులో మార్క్‌కు చికిత్స అందిస్తున్నారు. మార్క్ కోలుకొంటున్నాడని.. ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడంతో తదితర ఆరోగ్యపర ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలియచేశారు.
కాగా కొద్ది గంటల క్రితం అత్యవసర వార్డ్ నుంచి గదికి తీసుకొచ్చిన వైద్యులు.. మరో మూడు రోజులపాటు పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. ఇక మార్క్‌ని చూసేందుకు మెగా కుటుంబ సభ్యులు సింగపూర్ బయలు దేరారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు సింగపూర్ వెళ్ళగా.. నాగబాబు, ఇతర కుటుంబ సభ్యులు ఎవరెవరు వెళుతారు అనే అప్డేట్ తెలియాల్సి ఉంది. ఇక ఈ కష్ట సమయంలో తమ్ముడికి అండగా ఉండడానికి చిరు.. సురేఖ తో కలసి సింగపూర్ వెళ్లాడు.