నెల్సన్ – తారక్ కాంబో అప్డేట్.. ఎలాంటి రోల్ లో కనిపించనున్నాడంటే..?

టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు త‌మ‌కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని పాన్ ఇండియా లెవెల్‌లోను దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ లిస్ట్‌లో తార‌క్ కూడా ఒక‌డు. తనదైన రీతిలో వైవిధ్య‌మైన న‌ట‌న‌తో సత్తా చాటుకుంటూ.. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ స‌ప‌రేట్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకోవ‌టానికి క‌ష్ట‌ప‌డుతున్నాడు. కాగా తార‌క్‌ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు అయితే.. ఇక పై ఆయ‌న నుంచి రానున్న‌ సినిమాలు మరొ లువుల్‌లో ఉండ‌నున్నాయి. గతేడాది దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తార‌క్ ఈ సినిమాతో ఊహించిన మేర స‌క్స‌స్‌ సాధించలేకపోయాడు.

కాగా.. తాజాగా బాలీవుడ్ వార్ 2 సినిమా షూట్‌ను పూర్తి చేసిన తారక్‌.. ఈ సినిమాతో మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా ప్రస్తుతం ప్ర‌శాంత్ నీల్‌ డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తారక్.. ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంటే పాన్‌ ఇండియా లెవెల్లో తారక్ మార్కెట్ మరింతగా పెరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా తర్వాత.. ఎన్టీఆర్, నెల్సన్ కాంబోలో మరో సినిమా ఉందని తెలిసిందే.

Jr NTR to team up with Nelson Dilipkumar? 'RRR' star hints at new project |  - The Times of India

ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందని క్లారిటీ మాత్రం లేదు. కాగా.. ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ నెల్సన్ తో పనిచేయబోయే సినిమాల్లో ఒక మాస్ యాంగిల్ ని సరికొత్త కోణంలో కనిపించనున్నడని టాక్ అయితే వైరల్ గా మారుతుంది. గతంలో నెల్సన్ రజనీకాంత్ జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. దానికి తోడు నెల్సన్.. జైలర్ 2తో మరోసారి ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటే ఇక ఆయనకు దర్శకుడుగా తిరుగుండదు అనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ మాఫియా డాన్‌గా కనిపించనున్నాడని సమాచారం.