బద్రి @ 25: క్లైమాక్స్ కు నో చెప్పిన పవన్.. ఇంత కథ నడిచిందా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగులో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్లు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ నటించిన సినిమాల లిస్ట్ లో బద్రి కూడా ఒకటి. పూరీ జగన్నాథ్ దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ సినిమాతో.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు.. ఆడియన్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లో ఎక్కడ విన్న ఎక్కడ చూసినా బద్రి సినిమా డైలాగ్, సాంగ్స్ వినిపిస్తూ ఉండేవి. కాగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమాకు నిన్న (ఏప్రిల్ 20) తో 25ఏళ్లు పూర్తయింది. కాగా పూరి తన 25 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్టర్లు, అలాగే ఘోరమైన డిజాస్టర్లు కూడా చూశాడు. కాగా.. మొదటి సినిమా బద్రికి పూరి జగన్నాథ్ ఎలా కష్టపడ్డాడు.. పవన్ ను ఎలా ఒప్పించాడు ఆ విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం.

Badri (2000)

రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించిన పూరి జగన్నాథ్‌.. సొంతంగా ఒక కథను తయారుచేసి పవన్‌తో సినిమా చేద్దామని ఆయన మేనేజర్ చుట్టు తిరగడం ప్రారంభించాడట. ఆయన ఉపయోగం లేకుండా పోయింది. దీంతో గతంలో దూరదర్శన్ ద్వారా పరిచయం ఉన్న శ్యామ్ చోటా కె.నాయుడుని కలిసి.. పవన్‌కు కథ చెప్పే అవకాశం ఇప్పించండి అని రిక్వెస్ట్ చేయడంతో.. అప్పటికే పవన్‌కు.. చోటా కె నాయుడుతో ఉన్న స్నేహంతో పవన్ కి మంచి కథ చెప్పకపోతే నా పరువు పోతుంది.. మొదటి నాకు కథ చెప్పు అప్పుడు ప్రయత్నిస్తా అన్నాడ‌ట‌. తన దగ్గర ఉన్న ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం క‌థ‌ను పూరి.. చోటా కె.నాయుడుకు వివరించాడట.

ఇక ఆ కథ చోటాకి నచ్చడంతో.. ఇదే కథను చిన్న పాయింట్గా పవన్ కు చెప్పి పూరిని కలిసేందుకు పవన్ ను ఒప్పించాడు. ఈ క్రమంలోనే పవన్ తెల్లారి గట్ట నాలుగింటికి రమ్మని.. కేవలం అరగంట మాత్రమే సమయం ఇచ్చాడట. పూరి కచ్చితంగా నాలుగు గంటలకల్లా పవన్ ఇంటికి వెళ్లి ఆయనకు కథ చెప్పడం మొదలుపెట్టేసాడు. అరగంట గడిచిపోయి గంటయింది.. గంట కాస్త నాలుగు గంటలు అయింది.. పవన్ మాత్రం కథ‌ని ఇంట్రెస్టింగ్గా వింటూనే ఉన్నాడట. పవన్ కు ఆ స్టోరీ నచ్చింది. కానీ.. క్లైమాక్స్ మార్చమని సలహా ఇచ్చాడట. హ‌మ్మయ్య ఎలాగో కథ అయితే ఓకే అయింది. క్లైమాక్స్ చూద్దాం అంటూ పవన్ కు ఓకే చెప్పి పూరి బయటకు వచ్చేసాడు.

PSPK 28: Pawan Kalyan and Puri Jagannadh to team up again? | Telugu Movie  News - Times of India

క్లైమాక్స్ మార్చమని పవన్ సూచించడంతో దానిపై కసరత్తులు మొదలుపెట్టిన పూరి.. వారం రోజులైనా సరే క్లైమాక్స్ మాత్రం తనకు నచ్చినట్లు రావడం లేదని వారం తర్వాత మళ్లీ వెళ్లి పవన్ ను కలిసాడట. ఏమైంది క్లైమాక్స్ మార్చావా అని పవన్ అడగ్గా.. ప్రయత్నించా కానీ.. కొత్త వర్షన్‌ నాకే నచ్చట్లేదు.. క్లైమాక్స్ మార్చడం కుదరదని పూరి సమాధానం చెప్పాడట. నా గురించి నువ్వు క్లైమాక్స్ మారుస్తావా.. లేదా.. చూద్దామని అలా అడిగా. ఆ క్టైమాక్సే బాగుంది అని పవన్ అనడంతో.. పూరి ఫుల్ హ్యాపీ అయిపోయారు. అయితే వెంటనే పవన్ అన్నట్టు.. చోటకు నువ్వు ఈ క‌థ కాదుగా చెప్పింది.. ఇప్పుడు నువ్వు చెప్పిన కథ వేరు, చోట నాకు చెప్పిన కథ వేరు అని ప్రశ్నించడంతో.. అవకాశం పోతుందని ఆయనకు ఆ కథ చెప్పేశా అని పూరి వివరించారట. ఇలా పూరి జగన్నాథ్ను పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడానికి వెనుక పెద్ద కథ నడిచింది.