నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ హిట్3. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా యూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అందులో డైరెక్టర్ శైలేష్ మాట్లాడుతూ సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. హిట్ యూనివర్స్‌లో భాగమైన విశ్వక్, శేష్, నాని.. ముగ్గురినీ పక్క పక్కనే చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుందని.. రాజమౌళి హిట్ సరీస్‌కు ఆస్థాన చీఫ్ గెస్ట్ అయిపోయారని.. మేమెన్ని హిట్ సిరీస్‌లు చేసినా అన్నింటికీ మీరే గెస్ట్ గా రావాలని కోరుకుంటున్నా అంటూ కామెంట్లు చేశాడు. మీరు మా లక్కీ ఛార్మ్ అని వివరించాడు.
ఇక ఈ సినిమాను నాని ఓకే చేసినప్పుడు చాలా భయపడ్డా.. కారణం నానిపై నాకున్న ప్రేమ.. దగ్గరయ్యే కొద్దీ ఇష్టాలు తగ్గుతుందని భయపడ్డా.. కానీ.. ఈ జర్నీలో నానికి ఉన్న ప్యాషన్, సినిమా పట్ల ఉన్న మ్యాడ్ లవ్‌ను చూశా అంటూ వివరించాడు. నానికి ఏదైనా ఐడియా చెప్పడానికి 10 గంటలకు హోటల్ కి వెళ్లిన.. ఆ టైంలో ఏదో ఒక సినిమా చూస్తూ కూర్చుంటాడని.. సరదాగా కూర్చుని మాట్లాడదామన్న.. సినిమాల గురించి చెప్తాడని.. ఆయన ప్రపంచమంతా సినిమాల చుట్టూనే తిరుగుతుందని వివరించాడు. ఇక సినిమా షూట్ టైంలో ఫైట్ కోసం డ్రోన్ షాట్ తీసుకునే టైం లో ఫైర్ వచ్చి ఆయన నెత్తిపై పడింది. ఒక పక్క హెయిర్ కాలిపోయింది. ఆరోజు షూటింగ్ ఉండదు ప్యాకప్ అని అనుకున్నాం.
టైం కు క్యారవాన్‌కు వెళ్లి హెయిర్ సెట్ చేసుకొని వచ్చేసి మరీ.. మళ్ళీ షాట్ కు రెడీ అయ్యారు. దాంతో ఏంటి మనిషి అనుకున్న. అలా షార్ట్ చేస్తున్న టైంలో కెమెరా తలకు తగిలి చర్మం సీలి రక్తం కారుతుంటే.. ఇంకెన్ని షార్ట్స్ ఉన్నాయని అడిగారు. రక్తం గడ్డకట్టే వరకు ఆగి షూటింగ్ పూర్తయిన తర్వాత వెళ్లారు. ఆరోజు నైట్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ.. మార్నింగ్ ఐదు గంటలకు శ్రీనగర్ వచ్చేసి.. అక్కడ నుంచి మూడు గంటలు జర్నీ చేసి షూటింగ్ లోకేషన్ కు వచ్చేసాడు. సినిమాపై నానికి ఉన్న ఫ్యాషన్ అది. అందుకే ఆయనతో సినిమా చేసిన చేయకపోయినా ఆయన పక్కన ఉంటే అదో ఇన్స్పిరేషన్ ఉంటుందనిపిస్తుంది అంటూ శైలేష్ వివరించాడు. తనను నమ్మి తనకు అవకాశం ఇచ్చినందుకు నానికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటూ వివరించారు.