ఆ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ చెక్ అంటూ.. బట్టలు విప్పి కూర్చోమన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ డైరెక్టర్ షాజిద్ ఖాన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ బుల్లితెర నటిన న‌వీన బోలె వివ‌రించింది. గతంలో అతని వల్ల ఎదురైన ఇబ్బందికర సంఘటనను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది. నవీన మాట్లాడుతూ.. ఓ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని సాజిద్‌ పిలిస్తే ఆఫీస్‌కు వెళ్లా.. అతను చేసిన పనికి జీవితంలో అతన్ని కలవకూడదని ఫిక్సయ్యా అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే ఆఫీసుకు వెళ్ళాక ప్రాజెక్టు గురించి చెప్తాడు ఏమో అని నేను చాలా ఆసక్తిగా ఉన్నా.. సమయానికి అతను నీ దుస్తులు తీసేసి కూర్చోవచ్చుగా అని ప్రశ్నించాడంటూ వివ‌రించింది.

अब 'इश्कबाज' एक्ट्रेस की टूटी शादी, 7 साल बाद पति से ले रही तलाक, बताई वजह  - India TV Hindi

నీ శరీరంపై నీకు ఎంత నమ్మకం ఉందో.. దుస్తులు లేకుండా సౌకర్యంగా కూర్చో గ‌లవలేదు అని కాన్ఫిడెన్స్ టెస్ట్ చేస్తా అంటూ చెప్పాడని.. ఇది 2004, 2006 మధ్యలో జరిగింది అనుకుంటున్నా.. అతడు మాటలకు నా నోరు మూగబోయింది.. నేనేం సమాధానం ఇవ్వలేకపోయా.. వెంటనే ఏమైంది.. నువ్వు బికినీ వేసుకుంటావుగా నీకు ఇదేం పెద్ద సమస్య కాదు.. నువ్వు నీలా ఉండు అంతే అన్నాడని.. వెంటనే నేను అలాగైతే ఇంటికి వెళ్లి బికినీ తెచ్చుకుంటా అంతే తప్ప.. నీ ముందు అలా అంతా తీసేసి కూర్చోలేనని చెప్పానని చెప్పుకొచ్చింది.

Bigg Boss 16: 'Remove Sajid Khan' trends as netizens start a petition  demanding his eviction from Salman Khan hosted show

తర్వాత ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న అంటూ వివరించింది. అప్పటికి ఆత‌ను వదల్లేదని.. ఇంటికి చేరుకున్నావా.. ఆఫీస్ కు తిరిగి వస్తున్నావా.. ఇంకా రావడం లేదు ఏంటి అంటూ దాదాపు 50 సార్లు ఫోన్ చేశాడు అంటూ వివరించింది. ఇక 2018లో మీటు ఉద్యమం ఉదృతమైన సమయంలో షాజిద్ పై ఎంతోమంది ఆరోపణలు చేశారో.. నటి ర‌చెల్‌ వైట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ స‌లోని చోప్రా, జర్నలిస్ట్ కరిష్మా ఉపాధ్యాయ.. షాజిద్ ఖాన్పై.. ఇలా ఎంతోమంది లైంగిక వేధింపులకు పాల్పడ్డామంటూ వివరించారు.