టాలీవుడ్ మన్మధుడు నాగార్జున దాదాపు నాలుగు దశాబ్దాలుగా అదే క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరుపదుల వయసులోనూ కుర్ర హీరోల యంగ్ లుక్.. ఫిట్నెస్తో ఆకట్టుకుంటున్న నాగ్‌కు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నాగార్జున తన సినీ కెరీర్లో.. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలను, కొత్త దర్శకులను పరిచయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. ఈ క్రమంలోనే నాగార్జున ఎన్నో బ్లాక్ బస్టర్.. ఇండస్ట్రియల్ హిట్లను సైతం సొంతం చేసుకున్నారు. అయితే నాగ్ తన కెరీర్లో కొన్ని ఇండస్ట్రియల్ హిట్ సినిమాలు కూడా రిజెక్ట్ చేశాడట.
ఇంతకీ ఆ సినిమాలో లిస్టు నుంచి ఒకసారి చూద్దాం. కథ నచ్చక, డేట్లు ఖాళీ లేక, ఇతర ఇతర కారణాలతో ఆయన ఇప్పటివరకు రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మౌనరాగం, ఘర్షణ, దళపతి ఈ మూడు సినిమాలు మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కినవే. అయితే.. ఈ మూడు సినిమాలను వదులుకుని.. గీతాంజలితో ఆల్ టైం క్లాసిక్‌ను ఖాతాలో వేసుకున్నాడు నాగ్. ఇక ఆర్జీవి గతంలో రామాయణం ప్రాజెక్ట్ చేయాలని భావించాడు. దానికి నాగార్జున అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. నాగార్జున దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆ ప్రాజెక్టులో వదిలేశారు.
ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మొదట వెంకి రోల్ కోసం నాగార్జుననే భావించాడట డైరెక్టర్. కానీ.. నాగార్జున నో చెప్పడంతో వెంకీ, మహేష్ బాబులతో ఈ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక పూరి జగన్నాథ్ బద్రి సినిమాను నాగార్జునతో చేయాలని భావించారు. కానీ.. అది కూడా వర్కౌట్ కాలేదు. చివరకు పవన్‌తో రూపొందించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక మెకానిక్ అల్లుడు, కలిసుందాం రా, ఆహా సినిమాలకు సైతం మొదట నాగార్జుననే హీరోగా భావించారట. అయితే ఈ సినిమాలను కూడా ఏవో కారణాలతో నాగార్జున రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే న్యూస్ వైరల్ గా మారడంతో.. నాగ్ ఈ సినిమాలన్నింటిలోనూ నటించి ఉంటే.. మరిన్ని ఇండస్ట్రియల్ హిట్లు ఆయన ఖాతాలో పడేవంటూ ఫ్యాన్స్ నిరోత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.