బోయపాటి డైరెక్షన్లో చిరంజీవి.. స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. అంచెలు అంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాలతోనే కాదు తన మాట తీరుతోను మంచి పేరు సంపాదించుకున్న చిరు.. ఇప్పటికీ తన సినిమాలతో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇక‌ ఏడుపాదుల వయసులో ఆయన విశ్వంభ‌ర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా.. భారీ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌ల‌తో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న.. నటించబోయే సినిమాలు వేరే లెవెల్లో ఉండబోతున్నాయని సమాచారం. ఇండియన్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న చిరు.. ఇకపై అంతకుమించిన వినూత్నమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడట.

150th movie will start in August: Chiranjeevi | Regional News - The Indian  Express

ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో నటిస్తున్న సినిమాతో మంచి ఇమేజె సంపాదించుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకునేలా ప్రయత్నం చేస్తున్నాడట. ఇక ఈ సినిమా తర్వాత చిరు.. శ్రీకాంత్ ఓద్దెలతో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఇలాంటి క్రమంలో ఆడియన్స్‌లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఎంతో హైలెట్‌గా స్టోరీని డిజైన్ చేసినట్లు సమాచారం. కచ్చితంగా ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంటుందని టాక్ నడుస్తుంది. అంతేకాదు.. చిరంజీవి, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందంటూ టాక్‌ నడుస్తుంది.

Boyapati's Mega plan for Chiranjeevi - Telugu360

ఇక ఈ సినిమాతో పెను ప్రభంజనం ఖాయమని.. మాస్ హీరోగా పూర్తి లెవెల్లో చిరు మారబోతున్నాడని టాక్. ఇక ఈ కాంబోలో సినిమా వస్తుందంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న.. ఇప్పటివరకు సినిమా సట్స్‌పై కి రాలేదు. ఇక గతంలో చరణ్‌తో.. బోయపాటి వినయ్ విధేయ రామ సినిమాను తెరకెక్కించగా.. డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో.. చిరంజీవి బోయపాటితో సినిమా చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడట. కానీ.. ఇప్పుడు బోయపాటి చేస్తున్న సినిమాలకు మార్కెట్లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. బాలయ్యతో అఖండ 2 భారీ సక్సెస్ సాధిస్తుందని అభిమానులంతా గట్టి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కనుక చిరు కూడా తన లైనప్‌లో నెక్స్ట్ సినిమాను అంతే స్ట్రాంగ్ గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని.. ఇప్పటికే బోయపాటి.. చిరంజీవికి ఒక కమర్షియల్ కథను వినిపించి ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ లైన్ కి చిరంజీవి కట్టుబడి ఉండి.. సినిమా చేస్తాడా.. లేదా హ్యండ్ ఇస్తాడా అనేది వేచి చూడాలి.