నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.. కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో నటించిన తాజా మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. శ్రీకాంత్, సో హెల్ ఖాన్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు.. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా మెరిసింది. ప్రదీప్ చిలకలూరి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాకు.. సునీల్ బొలుసు, మెప్ప వెంకయ్య చౌదరి, కళ్యాణ్ రామ్, అశోక్ వర్ధన్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. భారీ తారాగణంతో.. టాలెంటెడ్ టెక్నీషియన్ లతో నాణ్యత లోపించకుండా ఖర్చుకు వెనకాడకుండా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇక దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భారీ రెస్పాన్స్ దక్కించుకుంది.
అంతేకాదు.. బిజినెస్ కూడా గ్రాండ్ నెంబర్లతో ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల హక్కులకురూ.18 కోట్లు.. కర్ణాటక ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ హక్కులు రూ.4 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు వివరించాయి. కదా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.25 కోట్ల వరకు షేర్ వశూళ్లు కొల్లగొట్టాల్సి ఉంది. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత విజయశాంతి ఈ సినిమాలో నటించడం.. అది కూడా కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా మెరవడంతో.. ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
కంటెంట్ పై కేడా మంచి స్పందన కూడా వచ్చింది. దీంతో సినిమాను ఏకంగా 1200 స్క్రీన్ లలో రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 750 స్క్రీన్లు.. ఇతర ప్రాంతాల్లో 500 స్క్రీన్ లో సినిమా రిలీజ్ చేయగా.. యావరేజ్ ఓపెనింగ్స్ నమోదు అవ్వడం అందరికి షాక్ కలిగించింది. మార్నింగ్ షోకు 35%, మ్యాట్నీ షోకి 30%, ఫస్ట్ షోకి 32%, సెకండ్ షోకు 35% ఆక్యుపెన్సి నమోదుకాగా.. కాకినాడ, వైజాగ్, చెన్నై, గుంటూరు, వరంగల్, నిజామాబాద్ ఇతర జిల్లాలో 30% నుంచి 45% ఆక్యుఫెన్సీ మాత్రమే నమోదు అయినట్లు సాక్ మిల్క్ వివరించింది. ఈ క్రమంలోనే మొదటి రోజు సినిమా ఊహించిన దాని కంటే తక్కువగానే కలెక్షన్లు నమోదు చేశాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.15 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కాగా మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా.. నేడు కలెక్షన్ల పరంగా మరింత పుంజుకునే అవకాశం ఉంది.