స్టార్ హీరో వైఫ్ రెస్టారెంట్లో కల్తీ ఫుడ్.. షాకింగ్ మ్యాటర్ రివీల్.. !

ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది రకరకాల వ్యాపార రంగాల్లో ఎంట్రీఇచ్చి అక్కడ కూడా సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రెస్టారెంట్, చైనా వ్యాపారాల్లో బిజీబిజీగా గడుపుతున్న పలువురు స్టార్ సెలబ్రిటీస్ భారీగా సంపాదిస్తున్ఆరు. అయితే సెలబ్రిటీల రెస్టారెంట్లలో ధరలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ధరలకు తగ్గట్టుగానే క్వాలిటీ మైంటైన్ చేస్తున్నారా అన్నది ఎప్పటికీ వీడని చిక్కుముడి. దీనికి సమాధానం కోసం ముంబైకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్ సచ్‌దేవ్‌ చేసిన ఓ ప్రయత్నంతో హాట్ టాపిక్ గా మారింది. అతను మొబైల్ లోని స్టార్ సెలబ్రిటీలను నిర్వహిస్తున్న హోటల్ అన్నింట్లోకి వెళ్లి.. మిషన్ పన్నీర్ అనే కాన్సెప్ట్ తో ప్రతి హోటల్లో పన్నీర్ కు ఉపయోగించే పదార్థాలను అని ఒరిజ‌న‌ల్‌గా ఉన్నాయా.. లేదా కల్తీ జరుగుతుందా.. అనేది పరిశీలించడం మొదలుపెట్టాడు.

దీనికోసం తాను తింటున్న ప్లేట్లోంచి ఒక పన్నీర్ ముక్కను తీసి దానిపై అయోడిన్ టెస్ట్ చేస్తాడు. ప్రతి చోట తాను చేసిన టెస్టులో రిజల్ట్ ఏం వస్తుందో పబ్లిక్ కి చూపించి మరీ వివరిస్తాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ – 18 కమ్యూన్, శిల్పా శెట్టి – బాస్టియాన్, బాబి డియోల్ – సమ్ ప్లేస్ ఎల్స్‌, షారుక్, గౌరీ ఖాన్ – పాలి హిల్ తినబండార, టోరీ లాంటి చోట్ల ఆహారను తీసుకొని పన్నీర్ చెక్ చేసాడు. ప్రతి చోటా పన్నీర్ నాణ్యతను ప్రామాణికతను పరీక్షించిన ఆయన ప‌రిశోధ‌న చేయ‌గా.. అన్ని చోట్లు ప‌న్నీర్ ఒరిజిన‌ల్ అని.. గౌరీ ఖాన్ టోరీలో మాత్రం తేడా పసిగట్టిన‌ట్లు వివ‌రించాడు. టోరీలో ఉండే పన్నీర్ అయోడిన్ పరీక్ష టైంలో నల్లగా మారిందని చెప్పుకొచ్చాడు.

Shah Rukh Khan and Gauri Khan's relationship decoded by body language expert

దానికి ఉపయోగించిన స్టాచ్ కలుషితమైనదని సచ్‌దేవ్ చెప్పుకొచ్చాడు. పన్నీర్‌ని ఉపయోగించే స్టార్చ్‌ను చెక్ చేయడానికి అయోడిన్ టింక్చ‌ర్‌ పరీక్షను చేస్తారు. సహజంగా తయారు చేసే పన్నీర్ స్ర్చ్‌ ఉండదు. ఒకవేళ ఉంటే.. పన్నీర్ పై అయోడిన్ వేయగానే నీలం నలుపు రంగులోకి మారితే అది ఫేక్ పనిర్‌. ఈ క్రమంలోనే టోరీ రెస్టారెంట్లో పన్నీర్ ఫేక్ అని సచ్‌దేవ్‌ వివరించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగానే క్షణాల వైరల్ గా మారింది. అయితే వెంటనే రెస్టారెంట్ యాజమాన్యం దీనిపై రియాక్ట్ అయ్యారు. అతని వేలెత్తి చూపించిన ఆ వంటకం సోయా ఆధారిత పదార్థమని.. అయోడిన్ టెస్ట్ సరిగ్గా చూపించదు అంటూ వాదనలు మొదలుపెట్టారు. తమ హోటల్లో అన్ని స్వచ్ఛమైన నాణ్యమైన పదార్థాలనే వాడుతున్నామని.. స్టాప్ చెప్పుకొచ్చారు. దీనిపై గౌరీ ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు.