కోట్ల ఆస్తులు పోగొట్టుకుని అడుక్కునే స్టేజ్‌కు దిగజారిన స్టార్ హీరోయిన్‌.. కారణం అతనే..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కామెడీ ట్రాక్ ని కూడా హీరోలే రన్ చేస్తూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. కానీ.. ఒకప్పుడు మాత్రం కామెడీ ట్రాక్ సపరేట్ ఫాన్ ఫాలోయింగ్ ఉండేది. కమెడియన్లకు మంచి క్రేజ్ ఉండేది. అందులో లేడీ కమెడియన్స్ కూడా స్టార్లుగా రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్లను కూడా స్టార్ హీరో, హీరోయిన్లతో సమానంగా ట్రీట్ చేస్తూ ఉండేవారు. అందరూ సమానంగా ఉండే వాళ్ళు. అలాంటి లేడీ స్టార్ కమెడియన్లలో గిరిజ ఒకటి. ఈమె ప‌లు సినిమాల్లో హీరోయిన్ గాను నటించి ఆకట్టుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రంగనాథం, శివాజీ గణేషన్, జగ్గయ్య లాంటి హీరోలతో సినిమాల్లో ఆకట్టుకుంది. తర్వాత కమెడియన్ గా భారీ పాపులారిటీ దక్కించుకుంది. దాదాపు తెలుగులో వంద సినిమాల్లో నటించిన గిరిజ.. కంకిపాడు కు చెందిన మహిళ.

గిరిజ (నటి) - వికీపీడియా

1952 నుంచి 1984 వరకు ఇండస్ట్రీలో యాక్టివ్ గా కొనసాగింది. మూడు దశాబ్దాలుగా రాణించింది. స్టార్ హీరోల సరసన హీరోయిన్గా.. తర్వాత రేలంగితో కలిసి కామెడీ పాత్రల్లో ఆకట్టుకుంది. వీరిద్దరి జోడి సినిమాల్లో నవ్వులు పూయించేది. అలా.. హీరోయిన్గా, కమెడియన్గా బిజీబిజీగా గడిపిన ఈ అమ్మడు.. ఇప్పటి రూపాయితో పోలిస్తే కోట్లల్లో ఆస్తులు గడిచింది. తర్వాత కూర్చుని తిన్న కరగనంత ఆస్తులను దక్కించుకుంది. కానీ.. ఆమె పెళ్లి జీవితం లైఫ్ని తలకిందులు చేసింది. గిరిజ నటుడు సి.ఎస్. రాజును వివాహం చేస్తుంది. అతను తాగుడికి బానిస అవడం తాగొచ్చి గిరిజను చిత్రహింసలు పెట్టడం.. సినిమాల్లో నటించకుండా ఆపేయడం, కొట్ట‌డం చేసేవాడ‌ట‌. ఈ క్రమంలోనే తాగి వచ్చి మైకంలో గిరిజను కొట్టడంతో.. ఒకసారి తల పగిలి 14 కుట్లు కూడా పడ్డాయట.

నటిగా ఎంతో వైభవంగా బతికిన ఆమె.. ఇంట్లో భర్త విషయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొందని.. గిరిజ చేసే దానధర్మాలు భర్త జల్సాలకే ఆస్తులన్నీ కరిగిపోయాయి అని సమాచారం. ఆస్తులు అన్ని అయిపోయిన తర్వాత.. భర్త ఆమెను వదిలేసి ఒంటరి చేసి వెళ్లిపోయాడు. దీంతో అటు మూవీ అవకాశాలు లేక.. కుటుంబాన్ని సాకలేక.. ఎన్నో ఇబ్బందులు పడిన గిరిజ ఆర్థికంగా చితికిపోయి చివరకు 50 కి వందకి ఇతరుల వద్ద అడుక్కోవాల్సిన స్థితికి వచ్చేసిందట. పోట గడవడం కూడా చాలా కష్టమైపోయిందట. ఈ విషయాన్ని సీనియర్ స్టార్ నటి వై విజయ వెల్లడించింది. తన వద్ద కూడా చాలాసార్లు డబ్బులు అడుక్కుందని.. నటి వై.విజయ చెప్పుకొచ్చింది. అప్పులు కావడంతో పెద్ద బంగ్లాని కూడా వదిలేసి చిన్న అద్దె ఇంటికి షిఫ్ట్ అయిందని.. చివరికి అనాధగా బస్టాండ్‌లో చనిపోయిందని వై.విజయ వివరించింది. ఓ ఇంటర్వ్యూలో వై. విజయ పంచుకున్న ఈ విషయాలతో గిరిజ ద‌యానియా పరిస్థితి అందరికీ తెలిసింది.