ఓకే హీరోతో 130 సినిమాలు.. 50 హిట్స్.. గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఒకే హీరో, హీరోయిన్ల కాంబోలో సినిమాలు తరచూ రిపీట్ అవుతూ ఉండటం కొన్ని సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. అయితే 10 లేదా 15 సినిమాలు ఇద్దరు స్టార్ హీరో, హీరోయిన్లు కలిసి నటించడమే చాలా అరుదు రికార్డ్. అలాంటిది.. ఒక హీరోయిని ఏకంగా 130 సినిమాలను ఒకే హీరోతో నటించి.. వాటిలో 50 హిట్స్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా క్రియేట్ చేసింది. సౌత్ ఇండస్ట్రీలో మొత్తం 500 కు పైగా సినిమాలు నటించిన ఈ అమ్మడు.. అప్పట్లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన హీరోయిన్లలో కూడా ఒకటిగా నిలిచింది. అంతేకాదు.. ఒక సినిమాకు రచన, దర్శకత్వం వహించిన ఏకైక హీరోయిన్ గాను రికార్డు క్రియేట్ చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా.. తన్నే ఒకప్పటి స్టార్ బ్యూటీ షీలా సెలీన్.

Actor Sheela on evolution of work culture in film industry: 'It is a more  relaxing affair now' | Malayalam News - The Indian Express

ఇక మలయాళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు.. తల్లిదండ్రులు షీలా సెలీన్ అని పేరు పెట్టగా.. తర్వాత షీలా దేవిగా మార్చుకుంది. షీలా 17 సంవత్సరాల వయస్సులో.. ఎంజీఆర్ నటించిన పాశంతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 1962లో రిలీజ్ అయిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ కావడంతో తర్వాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తన పేరును షీలా దేవిగా మార్చేసుకున్న షీలా తమిళ్ సినిమాల్లో చేసిన అన్ని రోజులు అదే పేరు కొనసాగింది. తర్వాత ఆమె తన అసలు పేరుకు మళ్ళీ మార్చుకుంది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు తెలుగు తో పాటు తమిళ్, మలయాళ, ఉర్ధు బాషన్లోనూ 475 సినిమాలుకు పైగా నటించి ఆడియన్స్ను మెప్పించింది.

Veteran actress Sheela on her will: I am a Christian, but I wish to be  cremated; My ashes should be immersed in Bharathapuzha | Malayalam Movie  News - The Times of India

ఇక ఈమె కెరీర్ లోనే అత్యంత ముఖ్యమైన విశేషమేంటంటే.. మలయాళ సూపర్ స్టార్ ఫ్రేమ్ నజీర్ తోనే ఏకంగా 130 సినిమాల్లో ఈ అమ్మడు నటించింది. వీళ్లిద్దరి ఐకానిక్ జోడిగా మారిపోయింది. షీలా, ప్రేమ్ ఇద్దరూ భారతీయ సినీ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ సక్సెస్ఫుల్ ఆన్ స్క్రీన్ జంటగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే గిన్నిస్ రికార్డ్‌లోను పేరు దక్కించుకున్నారు. ఇక షీలా 19780 లలో శిఖరంగల్, యక్షగానం అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు.. స్క్రీన్ ప్లే కూడా తానే చూసుకుంది. తర్వాత పలు ప్రాజెక్టులు చేసిన షీలా 1987లో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించింది. తర్వాత తమిళనాడులో సెటిల్ అయినా ఏమే.. చాలా గ్యాప్ తర్వాత 2003లో మరోసారి రిఎంట్రీ ఇచ్చింది. మనసునక్కరే సినిమాతో ఆడియన్స్ను పలకరించింది. అదే ఏడాది తమిళ్ చంద్రముఖిలోను నటించింది. ఈ క్రమంలోనే చంద్రముఖి తమిళ్ వర్షన్ చూసిన ఈ జనరేషన్ ఆడియన్స్ సైతం ఆమెను టక్కున గుర్తుపడతారు.