టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప 2.. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సక్సెస్ మీట్‌లో సందడి చేసిన బన్నీ.. తాజాగా అరెస్టు కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఈ రోజు (శుక్రవారం ) ఉదయం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె భర్త పెట్టిన కేసు ఆధారంగా పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద హడావిడి వాతావరణం నెలకొంది. ఇక అరెస్టు అయిన కొద్దిసేపటికి బన్నీ తరుపు లాయర్ హైకోర్టుకు ఎమర్జెన్సీ బెయిల్ దాఖలు చేయగా.. అల్లు అర్జున్‌కు అక్కడ చుక్క ఎదురయింది. ఎమర్జెన్సీ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం వరకు చూసేది లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ కు సంబంధించిన మరో షాకింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది.
ఆయనకు తాజాగా పోలీసులు రిమాండ్ ప్రకటించారు. చంచల్ కూడా జైలుకు అల్లు అర్జున్ తరలిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏకంగా బన్నికి 14 రోజులు రిమాండ్ విధించరు పోలీసులు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కావాలనే తమ హీరోను ఇలా చేయని తప్పుకు ఇరికించి జైల్లో వేశారు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా తమ హీరోను విడిచి పెట్టాలని.. లేదంటే మరిన్ని వివాదాలు జరుగుతాయి అంటూ హెచ్చరిస్తున్నారు.