బన్నీకి హైకోర్ట్‌ ఎదురుదెబ్బ.. చిరంజీవికి నో చెప్పారు..!

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసులాట‌లో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇటీవ‌ల‌ బన్నీ ఆ కేసు కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇలాంటి క్ర‌మంలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. వెంటనే అల్లు అర్జున్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు ఎమర్జెన్సీ బెయిల్ దాఖలు చేశాడు. దీన్ని చాలా అత్యావసరంగా విచారించాలంటూ కోర్టుకు కోరారు. అత్యవసర పిటిషన్ అయినా ఉదయం పదిన్నర గంటలకు మెన్షన్ చేయాలి కదా.. అని కోర్టు నిరంజన్ రెడ్డిని ప్రశ్నించింది. పిటిషన్ను బుధవారమే మెన్షన్ చేశామని.. క్వాష్ పిటిషన్ వేసామని నిరంజన్ వెల్లడించాడు.

దీనిపై న్యాయస్థానం స్పందించి.. ఈ పిటేషన్ సోమవారం విచారిస్తామంటూ వెల్లడించింది. బ‌న్నీని చిక్కడపల్లి పోలీసులు ఇప్ప‌టికే అరెస్ట్ చేసిన క్రమంలో.. దీన్ని లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించాలంటూ లాయ‌ర్ పిటీష్‌న‌ర్‌ను అభ్యర్థించాడు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు లంచ్ మోషన్ పిటిషన్ విచారించడం సరైన చర్య కాదని ప్రభుత్వం తరఫు లాయర్ కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళాడు. లాయర్ నిరంజన్ రెడ్డి మాత్రం.. సోమవారం వరకు పోలీసులు ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించాలని హైకోర్టును కోరాడు. అయితే పోలీసుల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత.. వాటిని కోర్టుకు తెలియపరుస్తామని ప్రభుత్వ తరపు లాయర్ కోర్టుకు వెల్లడించాడు.

ఇక బ‌న్నీని పోలీసులు అరెస్ట్ చేయడంతో స్టేషన్ దగ్గరకు తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు ఇలా ఎంతో మంది ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. లంచ్ మోషన్స్ ఒకటిన్నర గంటలకు స్వీకరించాలనడంతో అర్థం లేదని.. కోర్టు తేల్చ‌డంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలో మొదలైంది. కేసులో పోలీసులు బన్నీకి స్టేషన్ బెయిల్ ఇస్తారా.. లేదా రిమాండ్‌కు తీసుకువెళ్తారా.. అనేది వేచి చూడాలి. దీనిపై సాయంత్రానికి కొంత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇక స్టేషన్ వద్దకు చిరంజీవి వస్తున్నారని సమాచారం తెలుసుకుని పోలీసులు ఆయనను రావద్దని కోరార‌ట‌. అభిమానులు కూడా వస్తే తమపై తీవ్ర ఒత్తిడి పడుతుందని.. భద్రత ఏర్పాట్లు కష్టమవుతాయని చెప్పడంతో చిరు రాక మానుకున్నట్లు తెలుస్తుంది.