సంధ్య థియేటర్ తొక్కిసులాట కేసులో నిందితుడుగా అల్లు అర్జున్ నీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తోకీసులాటలో మరణించిన రేవతి భర్త.. పుష్ప 2 ప్రీమియర్ షో కు బన్నీ రావడంతో క్రౌడ్ ఎక్కువై ఆర్టీసీ క్రాస్ రోడ్, సంధ్య థియేటర్లో రేవతి 39 ఏళ్ల తన భార్య మరణించిందని.. అలాగే తమ కొడుకు తీవ్ర గాయలతో ఆసుపత్రి పాలయ్యాడని.. దీనికి హీరో అల్లు అర్జున్‌తో పాటు.. థియేటర్ యాజమాన్యమే కారణం అంటూ బిఎస్ఎస్ 105, 18 సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.
ఈ క్రమంలోనే బాధిత కుటుంబం పెట్టిన కేసు కాపీ నెట్టింట వైరల్ గా మారింది. కాగా బన్నీ తరపు లాయర్ బన్నీకి బెయిల్ కావాలంటు హైకోర్టును ఆశ్రయించినా.. అక్కడ కూడా చుక ఎదురైంది. సోమవారం వరకు ఆ పిటీషన్‌ను తీసుకోవడం కుదరదు అంటూ కోర్టు తెల్చి చెప్పింది. ఇలాంటి క్రమంలో కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కొద్ది సేపటి క్రితం రేవతి భర్త భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు. అవసరమైతే నేను కేసు విత్ డ్రా చేసుకోవడానికి కూడా వెనకాడనని వెల్లడించిడు.
ఈ ప్రమాదానికి హీరో అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇదంతా జరిగిందని.. బన్నీని రిలీజ్ చేయాలంటూ పోలీసులను కోరాడు. అల్లు అర్జున్ తో పాటు.. ఆరోజు చాలామంది థియేటర్ కు వచ్చారంటూ ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం రేవతి భర్త చేసిన కామెంట్స్ కేసులో బిగ్ ట్విస్ట్‌గా నిలిచాయి. అసలు ఏం జరిగింది.. కేసు పెట్టిన ఆయనే అల్లు అర్జున్ కు సంబంధం లేదని మీడియా ముందు చెప్పడానికి కారణం ఏంటని సందేహాలు జనంలో మొదలయ్యాయి. అయితే ఈ కేసు ముందు ముందు మరిన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాలి.