టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ తాజాగా సంధ్య థియేటర్ ఇష్యూలో నిందితుడిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన క్రమంలోనే.. ఆయనకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కాగా గాంధీ హాస్పిటల్ అల్లుఅర్జున్ కు బీపీ, షుగర్ పరీక్షలతో పాటు.. కోవిడ్ 19 టెస్ట్ లు కూడా జరిగాయని ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ సునీల్ వెల్లడించాడు.
అని పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ ఫలితాలు వచ్చాయని.. చెప్పుకొచ్చిన ఆయన ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించామని చెప్పొచ్చాడు. సెక్యూరిటీ ఇష్యూస్ కారణంగానే ఆయనను సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. ఇక పరిక్షలని ముగిసిన తర్వాత పోలీసులు ఆయనను నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లారు.
అరెస్ట్ అంశంలో చట్టప్రకారం ముందుకు వెళ్తామని పోలీసులు వెల్లడించారు. ఇక వైద్య పరీక్షల రిత్యా గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్‌ను తీసుకువెళ్లగా.. అక్కడ ఆయనను చూసేందుకు అభిమానులు, రోగులతో పాటు.. వారి బంధువులు కూడా ఎగబడ్డారు. ఫోటోలు, వీడియోల కోసం ఆరాటపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది కూడా అల్లు అర్జున్‌తో ఫోటోలు తీసుకునేందుకు ఆశక్తి చూపారు. కాగా తాజాగా అల్లు అర్జున్ కు 14 డేస్ రిమాండ్ ను విధించారు. చంచల్‌గూడా జైల్లో ఆయన రిమాండ్‌లో ఉండనున్నట్లు సమాచారం.