జైలు నుంచి బన్నీ రిలీజ్.. ఇంటికి ఎందుకు వెళ్ల‌లేదు…?

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఇష్యూలో నిందితుడిగా అరెస్ట్ అయినా అల్లు అర్జున్.. చంచల్గూడా జైలు నుంచి నేడు ఉదయం ఆరున్నర గంటలకు రిలీజ్ అయ్యారు. మెయిన్ గేట్ నుంచి కాకుండా ప్రిజమ్స్‌ అకాడమీ గేట్ నుంచి అల్లు అర్జున్ ను మీడియా కంటపడకుండా పోలీసులు బయటకు పంపారు. ఫ్యాన్స్ కు ఎంట్రీ ఇవ్వకుండా అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే అల్లు అర్జున్ ఇక్కడే అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. ఆయన నేరుగా ఇంటికి వెళ్ళలేదు. గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు మొదట వెళ్ళాడు. గీత ఆఫీస్ లో మావయ్య చంద్రశేఖర్ రెడ్డి తో కాసేపు మాట్లాడిన తర్వాత.. మామ‌ ఇంట్లోనే తన భార్య, పిల్లలు ఉన్నారని.. వారిని చూసి తీసుకువచ్చేందుకని మామ ఇంటికి వెళ్ళాడు.

మామయ్య ఇంటి నుంచి.. భార్య, పిల్లలతో అల్లు అర్జున్ తన జూబ్లీహిల్స్ నివాసానికి ఉదయం 9 గంటలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే బన్నీ ఇంటికి వస్తారని తెలిసిన అభిమానులు.. గుమ్మగూడే అవకాశం ఉండడంతో.. సెక్యూరిటీ ఇష్యూస్ కారణంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక తన సినిమా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షో చూసేందుకు స్వయంగా థియేటర్లకు బన్నీ వెళ్ళ‌గా.. అక్కడ తొక్కేసులాటలో మహిళా మృతి చెందింది. ఈ క్రమంలోనే ఆమె చావుకు బన్నీ కూడా కారణం అంటూ నిన్న ఆయ‌న‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Allu Arjun Hugs Wife Sneha & Daughter Arha, Meets Family Members After Spending Night In Jail; VIDEO Of Emotional Reunion Surfaces

తెల్లారితే పుష్ప 2 రిలీజ్ అవుతుంది అనగా.. డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటలకు సంధ్యా థియేటర్ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసులాట్లో దిల్‌షుక్‌న‌గర్‌కు చెందిన రేవతి(35) మృతి చెందింది. ఆమెతో పాటు ఉన్న కొడుకు శ్రీ తేజ (9) అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వారితో పాటు తొక్కీసులాటలో మరింత మందికి చిన్నచిన్న గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన ధియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్ షో చూడడానికి హీరో అల్లు అర్జున్ రావడం కూడా ఓ కారణం అంటూ భావించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. నేడు ఉదయమే మధ్యంతర బెయిల్‌పై అల్లు అర్జున్‌ను రిలీజ్ చేశారు.