ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌కు లెక్ కలిసొచ్చి అంతా శుభం జరుగుతుంది అనుకునే క్రమంలో పెద్ద షాక్ తగిలిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడమే కాదు.. తెలుగులోనే నేషనల్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు బన్నీ. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. అయితే అల్లు అర్జున్ రాజకీయపరంగా పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ ఇచ్చిన తన ఫ్రెండ్ వైసీపీ అభ్యర్థి కోసం ఏకంగా అక్కడకు వెళ్లి మరి ప్రచారం చేయడం మెగా ఫాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. పుష్ప 2 బాయ్‌కాట్ చేయాలని.. ఎలాగైనా పుష్ప 2 ఫ్లాప్ అయ్యేలా చేస్తామంటూ మెగా ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు.
కానీ.. రిలీజ్‌కు ముందే మెగా ఫ్యామిలీ అంతా బన్నీతో కలిసి పోవడం పుష్ప 2కి సపోర్ట్ ఇవ్వడంతో.. ఎవరు ఊహించని విధంగా పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల కలెక్షన్లు కల్లగొట్టింది. సంధ్య థియేటర్ తొక్కేసిలాటలో రేవతి (36) మహిళా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె కొడుకు(9) కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ వెళ్లడం వల్లే ఆ తొక్కేసిలాట జరిగిందని.. ఆయనను కూడా నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించగా.. నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కేసు కొట్టేయాలంటూ బన్నీ తరుపు లాయర్ హైకోర్టులో క్రాస్ పిటిషన్ వేసాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్ట్.. అల్లు అర్జున్‌కు షరతుల మీద బెయిల్ మంజూరు చేశారు.
అల్లు అర్జున్ న్యాయవాదులు.. సర్టిఫైడ్ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చిన.. ఒరిజినల్ పత్రాలు ఉంటేనే రిలీజ్ చేస్తాం అంటూ అధికారులు పట్టుపట్టారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను నిన్న రాత్రి పది గంటల వరకు జైలు రిసెప్షన్లోనే ఉంచిన పోలీసులు.. తర్వాత మంజీరా బేరాక్ లోని క్లాస్ వన్ రూముకు తీసుకువెళ్లారు. అండర్ ట్రైన్ ఖైది గా ఆయనకు నెంబర్ 7697 ను కేటాయించారు. ఈ క్రమంలోనే ఓ రాత్రంతా పుష్ప రాజ్ జైల్లో సాధారణ ఖైదీలను ఉండాల్సి వచ్చింది. ఇక జైల్లోనే రాత్రంతా ఉన్న బన్నీని.. మంజీరా భారత్‌కు తరలించిన తర్వాత.. జైలు అధికారులు.. ఆయనకు ఫుడ్ ఆఫర్ చేసిన బన్నీ మాత్రం తీసుకోలేదని తెలుస్తుంది. కొత్త రగ్గ్, బెడ్ షీట్ ఇవ్వగా సాధారణ ఖైదీల నేలపై పడుకున్నారట. 14 రోజుల రిమాండ్ విధించిన క్రమంలోనే ఆయనకు ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని న్యాయాధికారులు ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు అన్ని జైల్లో వచ్చిన మరనాడు నుంచి అందుతాయని జైలు అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది.