సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకోవడమంటే అది సాధారణ విషయం కాదు. ఇక దాని కాపాడుకోవడానికి కూడా అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. ఇక హీరోయిన్గా సక్సెస్ సాధించాలంటే అందం, అభినయం, పట్టుదల, కృషితో పాటు ఖచ్చితంగా అదృష్టం కూడా కలిసి రావాలి. అలాగే సినిమాలో హీరోయిన్గా సక్సెస్ సాధించాలంటే ఫిజిక్స్ ఎంతో ముఖ్యం. ఈ క్రమంలోనే హిరోయిన్ గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎంతో మంది ముద్దుగుమ్మలు జిమ్‌ల బాట పడుతున్నారు.
ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఇప్పుడు నాజూకుగా మెరుపుతీగలుగా మారిపోతున్నారు. అలాంటివారిలో పై ఫోటోలో కనిపిస్తున్న బోద్దుగుమ్మ కూడా ఒకటి. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా. అది కాస్త కష్టమేలెండి. ఇప్పటికీ అప్పటికీ అసలు పోలికలు లేవు. ఈ హీరోయిన్ ఎవరో చెబితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈ అమ్మడి సన్నజాజులా మారి స్టార్ బ్యూటిగా మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. తన అంద, చందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఇంతకీ ఈమె ఎవరో చెప్పలేదు కదా.. తనే శ్రద్ధ శ్రీనాథ్. నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో హీరోయిన్గా శ్రద్ధ శ్రీనాథ్ టాలీవుడ్‌కు పరిచయమైంది.
తన 34 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. గతంలో ఎంతో బొద్దుగా ఉండేదట. కానీ.. తన కటోర శ్రమ, కృషితో ఇప్పుడు ఇలా నాజుగ్గా మారి మెరుపుతీగల కవ్విస్తుంది. 2017 లో కోహినూర్ అనే మలయాళం మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తమిళ్‌తో పాటు.. కనడ సినిమాల్లోని నటించి ఆకట్టుకుంది. 2018లో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇటీవల వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమాలోను ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం శ్రద్ధ.. తెలుగుతో పాటు తమిళ్, హిందీ లోను పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.