మేం విడిపోయాం… మ‌లైకాతో అర్జున్ బ్రేక‌ప్ ..?

బాలీవుడ్ స్టార్ సెలెబ్రెటీస్ మలైకా ఆరోరా.. నటుడు అర్జున్ కపూర్ చాలాకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా వీరిద్దరూ విడిపోయారంటూ న్యూస్ నెటింట‌ తెగ వైరల్ గా మారాయి. ఇద్దరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం.. ఇన్నాళ్లు ఒకే ఫ్లాట్లో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట.. కొద్ది నెలల క్రితం వేరువేరు ప్లాట్ల‌కు షిఫ్ట్ అవ్వడంతో వీరిద్దరూ విడిపోయారని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై వీరు ఎక్కడ అఫీషియల్‌గా ప్రస్తావించలేదు. కాగా ఇటీవల మలైకా అరోరా తన తండ్రిని కోల్పోయారు.

Malaika Arora on love amidst breakup rumours with Arjun Kapoor

ఆ టైంలో అర్జున్ కపూర్ ఆమెకు సపోర్ట్ గా నిలిచాడు. అన్ని వ్యవహారాలు తానే దగ్గర ఉండి చూసుకున్నాడు. ఈ క్రమంలో మళ్లీ.. మలైకా, అర్జున్ కలిసిపోయారంటూ వార్తలు వినిపించాయి. అయితే మొట్టమొదటిసారి నటుడు అర్జున్ కపూర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. తాము విడిపోయిన విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటి ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముంబైలో రాజ్ థాక్రే దీపావళి సెలబ్రేషన్స్ పార్టీలో సందడి చేసిన అర్జున్ కపూర్.. మాట్లాడేందుకు మైక్ తీసుకున్నారు.

Arjun Kapoor Confirms Breakup With Malaika Arora Amid Speculations -  Oneindia News

వెంటనే అక్క‌డ ఆడియ‌న్స్ అంతా మలైకా అని అరవడం ప్రారంభించారు. దీంతో తను ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నానని.. మీరు రిలాక్స్ అవ్వండి అంటూ కామెంట్స్ చేశాడు. అర్జున్ కపూర్ కామెంట్స్‌తో.. మలైకాతో ఇతనికి బ్రేకప్ అయ్యిందని చెప్పకనే చెప్పేసాడు. 2018 నుంచి డేటింగ్ చేస్తున్న ఈ జంట.. ఎన్నో ఫారెన్ ట్రిక్స్ ని ఎంజాయ్ చేశారు. కొన్ని నెలల కిందట వీరు వీడిపోయారు. ఇక ప్ర‌స్తుతం సింగం ఎగైన్ సినిమాలో అర్జున్ కపూర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక‌ నవంబర్ 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.