సౌత్ స్టార్ సెలబ్రిటి సమంత.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సెలెక్టివ్‌గా సినిమాలను, వెబ్ సీరియల్స్లను ఎంచుకుంటూ నటిస్తోంది సమంత. తాజాగా ఆమె నటిస్తున్న సిటాడైల్ హనీ.. బన్నీ.. వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌కు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఆమె కొద్ది కాలం క్రితం సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రలాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ట్రలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మా ఇంటి బంగారు తల్లి.. అనే ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేసింది సమంత.
తాజాగా మరో సినిమాకు ఈ అమ్మడు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతనే నటించనుందని సమాచారం. అయితే ఈ సినిమాలో ఓ యంగ్ హీరోతో సమంత రొమాన్స్ చేయనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఆ యంగ్ హీరో ఎవరో తెలిస్తే ఖచ్చితంగా అంతా ఆశ్చర్యపోతారు. అసలు ఊహించలేరు. అతనెవరో కాదు.. మొదట కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తర్వాత హీరోగా మారిన ప్రియదర్శి.
సమంత – ప్రియదర్శితో తన ప్రొడక్షన్ బ్యానర్ పై ఓ సినిమాలో నటించనుందని వార్తలు రావడంతో అంతా ఆశకచర్యపోతున్నారు. వీరిద్దరి జోడి ఎలా ఉండబోతుందని ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక సమంత దీంతో పాటే.. పలు చిన్న చిన్న సినిమాలకు కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మరి ప్రియదర్శి, సమంత కాంబినేషన్ నిజంగానే తెరకెక్కనుందా.. లేదా.. తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.