హీరో అబ్బాస్ కూతుర్ని చూశారా.. అమ్మడి అందం ముందు ఎవరైనా ఫిదా..

సౌత్ స్టార్ హీరో అబ్బాస్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1996 లో వచ్చిన ప్రేమదేశం సినిమాతో ఒకసారి గా స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న అబ్బాస్.. ఈ సినిమాలో తన హెయిర్ స్టైల్‌తో కుర్ర కారును ఆకట్టుకున్నాడు. అప్పట్లో యూత్ ఐకాన్‌గా నిలిచిన అబ్బాస్ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పటికీ ప్రేమదేశం సినిమాలోని ఎన్నో సాంగ్స్ కాలేజీ ఈవెంట్లలో, ఫంక్షన్లలో.. ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఓ ప‌క్క స్టార్ హీరోగా రాణిస్తూనే.. మరోవైపు రాజా, కృష్ణ బాబు, ప్రియ ఓ ప్రియ లాంటి సినిమాల్లో స్పెషల్ కీ రోల్స్‌లోను న‌టించి ఆకట్టుకున్నాడు.

Abbas : హీరో అబ్బాస్ కూతురిని ఎప్పుడైనా చూసారా..? ఆమె అందం ముందు హీరోయిన్స్  కూడా దిగదుడుపే - Telugu News | Have you ever seen Prema Desam Hero Abbas  daughter Emira Ali, see how ...

నీ ప్రేమకై , మారో లాంటి సినిమాల్లో విలన్ పాత్రలోనూ మెప్పించాడు. తమిళ్, తెలుగు భాషల్లో దాదాపు 50 పైగా సినిమాల్లో నటించిన అబ్బాస్.. ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. 2011లో మారో సినిమా తర్వాత అబ్బాస్ మరి ఏ సినిమాలోను కనిపించలేదు. కేవలం అడపాదడ పై యాడ్స్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే సినీ ఇండస్ట్రీకి దూరమైన.. అబ్బాస్.. న్యూజిలాండ్ లో ఫ్యామిలీతో కలిసి సెటిల్ అయిపోయాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని.. న్యూజిలాండ్లో మెకానిక్ పనులు కూడా చేసినట్లు ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించాడు.

Abbas: ప్రేమదేశం హీరో అబ్బాస్ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో! స్టార్  హీరోయిన్ ఫీచర్స్ - Telugu News | Have You Seen Hero Abbas Daughter Emira  Ali, Now She Looks Like A Heroine | TV9 ...

ప్రస్తుతం అబ్బాస్ ఓ మోటివేషనల్ స్పీకర్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక అబ్బాస్ ఫ్యామిలీ సంగతికి వస్తే.. 1997లో ఏరూమ్ అలి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న ఈయ‌న‌ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాడు. కూతురు ఏమిరా అలీ, కొడుకు అయామాన్‌ అలీ ఉన్నారు. ఎప్పటికప్పుడు అబ్బాస్ త‌న్న ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూనే ఉంటాడు. అలా తాజాగా తన కూతురు, కొడుకుతో ఉన్న అందమైన ఫోటోలను షేర్ చేశాడు. ఇక ఈ ఫోటోలో కూతురు ఏమిరా త‌న‌ అందంతో అందరిని ఆకట్టుకుంటుంది. స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అమ్మడి అందం ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈమె సినిమాల్లోకి వస్తే స్టార్ హీరోయిన్గా దూసుకుపోవడం ఖాయం అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.