తాము ఎంతగానో అభిమానించే హీరోకు.. దర్శకుడుగా ఓ సినిమా తీయడం అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఫ్యాన్స్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అలా.. సినిచిరంజీవిని ఎంతగానో అభిమానించే బాబి.. వాల్తేరు వీరయ్య మాతీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక నందమూరి నటసింహం బాలయ్యను బోయపాటి శ్రీను ఎంతగానో అభిమానిస్తారు. ఈ క్రమంలోనే వీరి కాంబోలో తెరకెక్కిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేశాయి. ఇలా డై హార్ట్ ఫ్యాన్స్ డైరెక్టర్గా మారితే అది ఖచ్చితంగా మంచి సక్సస్ అందుకుంటుందనటంలో సందేహం లేదు. మచ్చకు వీరిద్దరే కాదు.. ఇంకా ఎంతో మంది అభిమాన దర్శకులు వారి ఫేవరెట్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి మంచి సక్సెస్‌లు అందుకున్నారు.
ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్గా ఉన్న ప్రశాంత్ నీల్.. తన ఫేవరెట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ.. ఆయనతో సినిమా తీసేందుకు ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. యష్‌తో కేజిచఫ్ తర్వాత.. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న ప్రభాస్‌కు సలార్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఈ సినిమా సీక్వెల్ పై ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక సినిమాతో ప్రభాస్ లో మ్యాన్లీ లుక్ ని పాన్ ఇండియా లెవెల్‌కు పరిచయం చేసిన ఘనత నీల్‌కే దక్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ రెండు సినిమాలు ఆ హీరోలపై అభిమానంతో తెరకెక్కించినవి కాదు. అయినప్పటికీ ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్ అందుకున్నాయో తెలిసింది.
అలాంటి ప్రశాంత్ ఇప్పుడు తన అభిమాన హీరో తారక్ డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే నీల్ తన అభిమాన హీరోని ఏ రేంజ్ లో చూపిస్తాడు ఊహకే అందడంటూ ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఆయన దగ్గర రైటర్లుగా పని చేసిన వారు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. తారక్‌ను ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ప్రశాంత్ చూపించబోతున్నాడని.. తారక్‌ను ఎలా చూపిస్తాడని ఆసక్తి మాలో కూడా ఉందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో.. టైటిల్ ఎలా ఉండబోతుందో.. తారక్ ఎలా కనిపించబోతున్నాడు.. సినిమా రిలీజ్ ఎప్పుడు.. అనే అంశాలపై ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.