నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభంలో నటించి సూపర్ హిట్ అందుకున్న సినిమాల్లో పిల్ల జమిందార్ సినిమా ఒకటి. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇందులో నాని సరసన బిందు మాధవి, హరిప్రియ హీరోయిన్లు గా నటించి మెప్పించారు. బిందు మాధవి సిటీకి చెందిన మోడరన్ గర్ల్ గా మెప్పిస్తే.. అచ్చ తెలుగు పదహారణాల తెలుగింటి ఆడపడుచు గా హరిప్రియ.. సింధు పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇక హరిప్రియ కన్నడ సోయగమైనా.. చూడడానికి తెలుగు ఇంటి ఆడపిల్లల కనిసిప్తుంది. ఇక పిల్ల జమిందార్ సినిమాలో హరిప్రియ అందం, అభినయంత లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. మొదట భూమిక చావ్ల భర్త భరత్ ఠాకూర్ నిర్మాతగా వ్యవహరించిన తకిట తకిట సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచిన తర్వాత పిల్ల జమిందార్ సినిమాలో మరో అవకాశాన్ని కొట్టేసింది. ఇక ఈ సినిమా హిట్ కావడంతో.. అమ్మడుకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. వరుణ్ సందేశ్‌తో కలిసి.. అబ్బాయి క్లాస్, అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలాగే బాలకృష్ణతో జై సింహా సినిమాలోను స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇందులో ఆమె పోషించిన మంగ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దీన్ని తర్వాత తెలుగు తెలుగు సినిమాల్లో హరిప్రియ కనిపించలేదు. అయితే కన్నడ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటికి స్టార్ హీరోయిన్గా వెలుగుతుంది. బెల్ బటన్, కురుక్షేత్ర, పెట్రోమాక్స్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆకట్టుకుని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. కొలీవుడ్ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీ మురళి లాంటి స్టార్ హీరోల సరసన నటించే ఆకట్టుకుంది. తన నటనతో ఎన్నో అవార్డులను గెలుచుకుంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అమ్మడు.. ప్రముఖ విలన్ కేజీఎఫ్ నటుడు వశిష్టతో ఏడడుగులు వేసింది. ఇక వశిష్ట ఇప్పటికే నారప్ప, న్యాయం డైరీ, ఓదెల రైల్వే స్టేషన్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించాడు. గతకొద్ది రోజుల క్రితం చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ఏవమ్ సినిమాలోను విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక పెళ్లయిన తర్వాత సినిమాలు తగ్గించుకుంటూ వస్తుంది. అయితే ప్రస్తుతం అమ్మడి చేతిలో నాలుగు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. కాగా.. తాజాగా భర్తతో కలిసి కొత్త ప్రొడక్షన్ హౌసింగ్ స్టార్ట్ చేసింది. హరిప్రియ క్రియేషన్స్ నిర్మించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ జంటకు సంబంధించిన ఫొటోస్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈమె హరిప్రియానా.. ఏంటి ఇంతలా మారిపోయింది.. అసలు గుర్తుపట్టలేకపోతున్నాం అంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram