బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు సంపాదించిన జంటలలో అలియా భట్, రణబీర్ జంట కూడా ఒకరు.. వీరిద్దరు ప్రేమించుకొని మరీ వివాహం చేసుకున్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలను చేపడుతూనే మరొకవైపు సినిమాలలో బిజీగా ఉంటుంది ఆలియా భట్. అలాగే అప్పుడప్పుడు కూతురుతో కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలను అలియా భట్ , రణబీర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వయసు తేడా ఎంత అనే విషయాన్ని ఇటీవల అభిమానులతో రణబీర్ పంచుకున్నారు వాటి గురించి చూద్దాం.
రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. మొదటిసారి ఆలియా భట్ ని కలిసినప్పుడు ఆమె వయసు 9 ఏళ్లు తనకు మాత్రం 20 ఏళ్లు అని.. అలియా భట్ తన కంటే 11 ఏళ్లు చాలా చిన్నది అంటూ తెలియజేశారు రణబీర్.. అంతేకాకుండా అలియా భట్ తొమ్మిదేళ్ల వయసులోని రణబీర్ తో కలిసి ఫోటోషూట్ కూడా చేసిందట. అదేమిటంటే బాల్యవివాహాల పైన డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన ఒక చిత్రం కోసం వీరిద్దరి ఫోటోషూట్ జరిగిందంటూ రణబీర్ వెల్లడించారు.
ఆలియా తాను ఒకరినొకరు ఎలాంటి విషయంలోనైనా సర్దుకొని వెళ్తూ ఉంటామని.. అంతేకాకుండా ఆలియా భట్ తన కెరీయర్ని తన వ్యక్తిగత విషయాలను కూడా చాలా చక్కగా నిర్వహిస్తుంది అంటూ తెలిపారు. ఇద్దరికీ తమ కూతురే జీవితం అన్నట్టుగా మారిపోయిందని తెలిపారు. గతంలో లవర్ బాయ్ గా పేరు పొందిన రణబీర్ ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ గా మారిపోయారు.