తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు ప్రపంచమంతా తలెత్తుకుని చూసేలా.. గర్వపడే రేంజ్ లో టాలీవుడ్ ను నిలబెట్టాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్‌కు స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసిన జక్కన్న.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో పాన్ వరల్డ్ రేంజ్‌లో తెలుగు సినిమా సత్తా చాటేందుకు సిద్ధమౌతున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ట్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకోనున్నాడు. ఇక ఇప్పటికే రాజమౌళి తాను తీసిన ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మహేష్ బాబుతో.. జక్కన్న తెరకెక్కించనున్న పాన్ వరల్డ్ సినిమాపై ప్రేక్షకులో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో SSMB 29లో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో నటించనున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. లోకనాయకుడు కమల్ హాసన్. కమల్ హాసన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు వేరే హీరోల పేర్లు వినిపించినా.. ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో కమల్ హాసన్ నటిస్తున్నాడంటూ కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గానే కమల్.. కల్కి, భారతీయుడు 2 సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ రావడంతో.. ప్రస్తుతం కమల్ పేరు మారుమోగిపోతుంది. దీంతో కమల్ హసన్‌ను రాజమౌళి.. మహేష్ కు అన్నలా చూపించబోతున్నాడా.. లేదా పవర్ఫుల్ విలన్ గా చూపించబోతున్నాడా అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.
మొత్తానికి లోకనాయకుని రాజమౌళి సెలెక్ట్ చేసుకుని జక్కన మంచి పని చేశారంటూ.. జక్కన్న మైండ్‌బ్లోయింగ్ ప్లాన్ ఇది అంటూ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ ఎంతో మంది ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమల్ లాంటి విలక్షణ నటుడు మన ఇండియాలోనే మరొకరు లేరనడంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి పాత్రనైనా అలవోకగా నటించే కెపాసిటీ ఉన్న కమల్ హాసన్.. ఈ సినిమాలో నటించడం అంటే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.