కన్నడ సోయగం శ్రద్ధ శ్రీనాథ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులోనే కాదు.. అన్ని భాషలలోను నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో యూటర్న్ సినిమాతో భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న శ్రద్ధ.. ఎన్నో భాషల్లో విలక్షణ పాత్రలో కనిపించి మెప్పించింది. తెలుగులో నాని సరసన నటించిన జెర్సీ సినిమా ఆమెకు మంచి ఫేమ్ తెచ్చి పెట్టింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో సైంధవ్ సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా డిజాస్టర్.. దానికి తోడు అమ్మడి పాత్ర కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో ఆమెకు టాలీవుడ్ లో నిరాశ ఎదురయింది. ఈ క్రమంలో ఆమెకు చాలా కాలం వరకు టాలీవుడ్లో అవకాశాలు రాలేదు. కానీ కొంచెం గ్యాప్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశాన్ని కొట్టేసింది అంటూ వార్తలు వినిపించాయి.
ఒక శ్రద్ధ శ్రీనాథ్ సినీ కెరీర్లో తను ఎంచుకున్న కథలు, పాత్రలను బట్టి బాలయ్య లాంటి మాస్ హీరో సినిమాలో ఆమె సెట్ అవ్వదని బాలయ్య అభిమానులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయినా మాస్ ఆడియన్స్‌ని కూడా మెప్పించాలనే ఉద్దేశంతో శ్రద్ధా శ్రీనాథ్ ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కాగా ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందంటూ తాజాగా మరోసారి వార్తలు వైరల్ అయ్యాయి. షూట్‌లోకి వెళ్ళాక.. తను సూట్ కాదని ఆ పాత్ర నుంచి ఆమెను తప్పించారంటూ వార్తలు వైరల్ గా మారాయి. బాబీ డైరెక్షన్లో వస్తున్న ఎన్బికె 109 లో శ్రద్ధ మాత్రం నటించడం లేదని.. ఆమె ప్లేస్ లో ప్రగ్యా జైస్వాల్ వచ్చిందంటూ సమాచారం.
ఈ క్రమంలో బాలయ్య సినిమా నుంచి శ్రద్ధ అవుట్ అంటూ వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఇంతలోనే శ్రద్ధ శ్రీనాథ్ తమ సినిమాలో నటిస్తుందంటూ ఓ సినిమాకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ఇంతకీ ఆ సినిమా ఎవరిదో కాదు.. బాలయ్య, ఎన్టీఆర్ వీరాభిమానిగా చెప్పుకుంటూ వారితో ఎంతో సానిహిత్యంగా ఉండే విశ్వక్సేన్ సినిమా కావడం విశేషం. మూవీలో శ్రద్ధ నటించే అవకాశాన్ని కొట్టేసిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.. మెకానిక్ రాకి. ఇందులో మొదటి మీనాక్షి చౌదరి హీరోయిన్ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు శ్రద్ధ శ్రీనాథ్ తమ సినిమాలో ఉన్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ క్రమంలో మీనాక్షితో పాటు శ్రద్ధ శ్రీనాథ్ కూడా నటిస్తుందా.. లేదా మీనాక్షి పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్‌ను రీప్లేస్ చేశారా.. అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో బాలయ్యతో సినిమా మిస్ చేసుకున్న అభిమానితో నటించే జాక్‌పాట్ ఆఫర్లు పట్టేసిందే అంటూ శ్రద్ధ లేటెస్ట్ లుక్ ను తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.