టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమా తర్వాత ఆర్సి 16 రన్నింగ్ టైటిల్ తో మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకురానున్నాడు. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక రామ్ చరణ్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాంచరణ్ కు సంబంధించిన ఓ న్యూస్ నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. తాజాగా చరణ్ తన కొత్త కార్‌ను కొనుగోలు చేయగా.. ప్రస్తుతం ఇది నెటింట హాట్ టాపిక్ గా మారింది.
అనంత్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు రాంచరణ్, ఉపాసన కలిసి రోల్స్ రాయిస్ కారులో వెళ్లారు. ఇక ప్రస్తుతం వేడుకలకు చరణ్ లగ్జరీ కార్ ఎంట్రీ ఇచ్చిన పిక్స్ నెటింట వైరల్‌గా మారాయి. ఇక రోల్స్ రాయిస్ రామ్ చరణ్ ఎంట్రీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక హైదరాబాద్‌లో ఈ కార్ కొన్న ఫాస్ట్ కస్టమర్ చరణ్ అంటూ.. జనవరిలో ఈ మోడల్ రిలీజ్ చేశారని సమాచారం. ఇక ఈ కార్ ఖరీదు అక్షరాల రూ.7.5 కోట్లని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ లాగ్జరీ కార్ కాస్ట్ తెలిసి నెటిజన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు.
రామ్ చరణ్ రేంజ్‌కి ఈమాత్రం కాస్ట్లీ కార్ ఉండడంలో తప్పు లేదంటూ మెగా అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చరణ్ రెమ్యూనరేషన్ కూడా కోట్లలో ఉందన్న సంగతి తెలిసిందే. రాంచరణ్, బుచ్చిబాబు సన్న డైరెక్షన్లో ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న సినిమాకు చరణ్ ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక కెరీర్ పరంగా నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసుకుంటూ చరణ్ దూసుకుపోతున్నాడు. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారుతున్నాడు. ఇతర భాషల్లో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకుంటున్నాడు.