బాలయ్య ఫ్యాన్స్ కు శుభవార్త.. NBK109 వచ్చేది అప్పుడే.. !

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గ‌త‌ కొంతకాలంగా వెండితెర, బుల్లితెర, రాజ‌కీయ‌లు అని తేడా లేకుండా ఈయన ముట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఓ పక్కన రాజకీయాల్లోనూ సక్సెస్ఫుల్గా రాణిస్తున్న బాలయ్య.. బుల్లితెరపై అన్‌స్టాపబుల్ షోతో కూడా భారీ సక్సెస్ అందుకొని దూసుకుపోతున్నాడు. ఇక త్వరలోనే తన 109వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు బాలయ్య. యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం.. టాలీవుడ్ ప్రేక్షకులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు.

బాలీవుడ్ యాక్టర్ స‌న్ని డియోల్ బాలకృష్ణకు ప్రతి నాయకుడు సినిమాలో కనిపించ‌నున్నాడు. ఇక హ‌ట్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతెలా కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు.. ఇతర పాత్రలో ఎవరెవరు నటిస్తారు అనే విషయంపై ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఎన్బికె 109 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న‌ ఈ సినిమాకు థ‌మన్ సంగీతం అందిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది.

కాగా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తామా అంటూ నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమా రిలీజ్ డేట్ ఇదేనంటూ వార్త నెటింట‌ తెగ వైరల్‌గా మారింది. ఈ ఏడాది డిసెంబర్ 20 కల్లా సినిమాను పూర్తిచేసి రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కచ్చితంగా డిసెంబర్ 20కే కాకుండా ముందే సినిమా వచ్చేసే అవకాశం కూడా ఉందట. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు అఫీషియల్‌గా క్లారిటీ రాలేదు.