తమన్నాను క్షమాపణలు కోరిన సీనియర్ నటుడు.. అంత పెద్ద తప్పు ఏం చేసాడంటే..?

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు దాదాపు అందరితోనూ నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్‌డంతో కొనసాగుతున్న తమన్నా.. ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఓ సీనియర్ నటుడు తమన్నాకు క్షమాపణలు చెప్పాడంటూ వార్తలు నెటింట‌ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ నటుడు ఎవ‌రు.. ఎందుకు ఆయ‌న ఈ అమ్మ‌డుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్స్ వ‌చ్చిందో తెలుసుకుందాం.

అత‌ను మరెవరో కాదు కోలీవుడ్ సీనియర్ యాక్టర్, డైరెక్టర్ రాధాకృష్ణన్ పార్తిబ‌న్‌. ఆయన సోషల్ మీడియా వేదికగా తాజాగా తమన్నాకు క్షమాపణలు కోరాడు. తమన్నా డ్యాన్స్ పై కామెంట్స్ చేసినందుకుగాను ఆయన తమనకు సారీ చెప్పాడు. సినిమాలో కథ లేకపోయినా పర్వాలేదు గాని.. తమన్నా డ్యాన్స్ ఉంటే చాలు అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితులు మారాయి అంటూ పార్తిబ‌న్‌ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పార్టీ పనిచేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో తమన్న అభిమానులు ఆయనపై మండిపడ్డారు.

మీడియాలో ట్రోల్స్ చేస్తూ, భూతులు తిడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తమన్నాకు క్షమాపణలు తెలియజేశాడు పార్తిబ‌న్‌. సినీ ఇండస్ట్రీకి చెందిన వారందరిపై నాకు గౌరవం ఉందని.. నటీనటులను తక్కువ చేసే ఉద్దేశ్యం నాకు ఎప్పుడూ ఉండదని వివ‌రించిన ఆయ‌న‌.. నా మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ రాధాకృష్ణన్ పార్తిబన్‌ను వివరించాడు. కోలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన పార్తిబ‌న్‌.. తాజాగా దర్శకత్వం వహించిన మూవీ టీన్జ్.. జులై 12న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అడ్వెంచరస్ థ్రిల్లర్ గా బ‌చ్చిన‌ ఈ సినిమా భారీ వాసుళు రాబట్టింది.