ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక సినిమాలో ఇద్దరు హీరోలు లేదా ముగ్గురు హీరోలు ఉంటే అది మోస్ట్ వెయిటెడ్ మల్టీ స్టారర్‌గా హైప్ క్రియేట్ అవుతుంది. అదే ఏకంగా ఒక్క సినిమాలో 14 మంది హీరోలు ఉంటే.. ఇక ఆడియన్స్ కు రెండు కళ్ళు చాలవనడంలో సందేహం లేదు. ఇంతే కాదు 12 మంది హీరోయిన్స్ కూడా నటిస్తే ఇక సినిమాకు ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో అలాంటి ఓ అరుదైన సినిమా తెరకెక్కి గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటి.. అనుకుంటున్నారా. ఇదే తమిళ్‌లో తెరకెక్కిన స్వయంవరం.
1999లో తమిళ్లో రిలీజైన ఈ సినిమా తర్వాత పెళ్లంటే ఇదేరా.. పేరుతో తెలుగులోనూ డబై ఇక్కడ కూడా మంచి సక్సస్ అంఉకుంది. ఇందులో 14 మంది హీరోలు నటించి మెప్పించారు. బాలీవుడ్ కట్టప్ప సత్యరాజ్ అప్పట్లో కోలీవుడ్ స్టార్ హీరో. ఆయనతో పాటు ప్రభుదేవ హీరోగా కనిపించారు. అబ్బాస్, వినీత్, అర్జున్ ఇలా 14 మంది హీరోలతో పాటు 12 మంది హీరోయిన్లు కూడా ఈ సినిమాలో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇక వారిలో రోజా, రంభ, మహేశ్వరి, కుష్బూ, హీరా, దేవయాని, ఐశ్వర్య కస్తూరి లాంటి ఎంతో మంది కోలీవుడ్ భామలు ఉండడం విశేషం.
ఇలా సినిమా మొత్తం హీరోలు, హీరోయిన్లతో అందాల విందుగా మెరిసింది. దీంతో అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే ఈ సినిమాల్లో ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్లు కూడా ఉన్నాయి. ఈ సినిమా కేవలం ఒక్క రోజులో షూటింగ్ పూర్తి చేశారట. ఇంకా చెప్పాలంటే 23 గంటల్లోనే షూటింగ్ పూర్తి అయిపోయింది. మార్చి 24న షూటింగ్ ప్రారంభించి ఆ మూవీని ఆ ఒక్క రోజులోనే.. ఒక గంట ముందే పూర్తి చేసి చూపించారు. ఇక ఈ సినిమా పక్కా ప్లానింగ్ తో షూట్ చేశారు. ఈ సినిమాకు ఏకంగా 14 మంది డైరెక్టర్లు పనిచేశారట.
అంతేకాదు 19మంది కెమెరామెన్లు, అసోసియేట్ డైరెక్టర్లు. 45 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, 105 మంది డ్యాన్సర్లు కలిసి పనిచేసిన ఈ సినిమా.. ఓ ప్రయోగాత్మక సినిమాగా తెరకెక్కింది. ఇందులో కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఓ పాట కూడా పాడడం విశేషం. సినిమా మొత్తాన్ని ఓ డిఫరెంట్ వేలో కథ షూట్ పూర్తి చేశారు. ఒక్కో హీరో, హీరోయిన్, దర్శకుడు, కెమెరామెన్, ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్లు.. ఒక టీం గా విడిపోయి. 19 టీమ్లతో సినిమా తెరకెక్కింది. ఇక 1999 జూలై 16న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకుంది.