టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అంతా తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకురావడం అనేది సాధారణంగా జరుగుతుంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, రమేష్ బాబు, రామ్ చరణ్ అలా నటవారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిలో స్టార్ హీరోలుగా కొందరు సెటిలైతే మరికొందరికి ఫేడవుట్ అయ్యిపోయారు. అలా గతంలో సూపర్‌స్టార్ కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్‌బాబుని హీరోగా సక్సస్ చేసేందుకు చాలా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ సినిమాతో ఒక వివాదంలో చిక్కుకున్న కృష్ణ కోర్టు మెట్లు కూడా ఎక్కారు. చివరికి ఏ వివాదంలో ఆయనే విజయం సాధించారు.
ఈ వివాదానికి ముందు కృష్ణ తన కొడుకు రమేష్‌ను హీరోగా చూడాలని ఎన్నో కలలు కన్నారు. అందుకే రమేష్‌కి నటన, డ్యాన్సు, ఫైట్స్ అనిటిలో శిక్షణ ఇప్పించారు. ఆపై తెలుగు తెరకు పరిచయం చేశారు. బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘బేతాబ్’ రీమేక్ రైట్స్ సొంతం చేసుకుని పరుచూరి బ్రదర్స్‌తో కథను తెలుగు నేటివిటికి తగ్గట్టు రాయించారు. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ బప్పిలహిరితో సాంగ్స్ కంపోజ్ చేయించాడు. హీరోయిన్‌గా హిందీ యాక్ట్రెస్ సోనమ్‌ను ఎంచుకున్నారు. ఇక రమేష్‌కు ఇది మొదటి సినిమా కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌లోనే మూవీని ప్రారంభించారు. దీనికి ‘సామ్రాట్’ అనే టైటిల్ ఫిక్స్ అయ్యారు.
అయితే ఈ మూవీ టైంకి ఎన్టీఆర్, కృష్ణల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా సమయంలో వచ్చిన విభేదాల కారణంగా వీళ్లు చాలా కాలం మాట్లాడుకోలేదు. దీంతో రమేష్‌బాబు ఫస్ట్ మూవీ లాంచ్‌కు ఎన్టీఆర్‌ను కాకుండా అక్కినేని నాగేశ్వరరావుని పిలిచారు కృష్ణ. మరోవైపు బాలకృష్ణ అప్పటికే ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా రాణిస్తున్నాడు. కృష్ణ.. బాలయ్యను తొక్కేయడానికే రమేష్‌ను సినిమాల్లోకి తీసుకొస్తున్నారని అప్పట్లో పుకార్లు వినిపించాయి.రమేష్ ఫస్ట్ మూవీ మద్రాస్‌లో ఏవీఎమ్ స్టూడియోలో ప్రారంభించారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను కన్నడ దర్శకుడు రాజేంద్రసింగ్ బాబుకు ఇచ్చారు. అతను ఎక్కువగా డబ్బు ఖర్చు చేసినా దానికి తగిన ఔట్‌పుట్ దక్కలేదు. ఇది గమనించిన కృష్ణ వెంటనే అతడిని తీసి వి.మధుసూదనరావును దర్శకుడిగా పెట్టాడు.
ఇదే సమయంలో బాలకృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా కె.రాఘవేంద్రరావు సినిమా స్టార్ట్ అయ్యింది. దానికి కూడా ‘సామ్రాట్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ తమదంటే తమదంటూ రెండు సినిమాల నిర్మాతల మధ్య వివాదాలు మొదలయ్యాయి. దీంతో కృష్ణ కోర్ట్‌కు వెళ్ళారు. జడ్జి ఆ టైటిల్ హక్కులు సూపర్‌స్టార్ కృష్ణకే దక్కుతాయంటూ సంచలన తీర్పునిచ్చారు. ఫలితంగా బాలకృష్ణ సినిమా టైటిల్‌ను ‘సాహస సామ్రాట్‌సగా మార్చరు. అప్పట్లో ఈ కాంట్రవర్సీ వైరల్‌గా మారింది. బాలకృష్ణ ‘సాహస సామ్రాట్’ 1987 ఏప్రిల్ 13న రిలీజ్ చేశారు.
‘సామ్రాట్’ అదే ఏడాది అక్టోబర్ 2న ‘సామ్రాట్‌స రిలీజ్ మంచి హిట్ అందుకుంది. కృష్ణ చేసిన కృషి వల్ల రమేష్ ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ సాధించాడు. ఇక ఆయనకు హీరోగా తిరుగుండదని అందరూ అనుకున్నారు. కానీ రమేష్ సినిమాలపై ఫోకస్ పెట్టలేదు. దీంతో వరుస ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. 15 ఏళ్ల పాటు హీరోగా సినిమాలు చేసినా ఏదీ సక్సస్ కాలేదు. దాంతో ప్రొడ్యూసర్‌గా మారారు. మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలకు కూడా ప్రొడ్యూసర్‌గా చేశారు. అయితే కృష్ణ ఎంత కష్టపడినా పెద్ద కొడుకును సక్సెస్‌ఫుల్ హీరోగా చూడలేకపోయారు.