చెర్రీ – ఉపాసన మెగా ఫాన్స్ కు షాక్ ఇచ్చారుగా.. అమ్మ ఎంత పని చేశారు..?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పలు సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జానీ తెలుగులో ప్రసారమయ్యే ఎన్నో షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జానీ మాస్టర్ కు సంబంధించిన ఓ పోస్ల్ నుఎటింట‌ వైరల్ గా మారుతుంది. ఇక మెగా హీరో రామ్ చరణ్ అంటే జానీ మాస్టర్ కు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని స్వయంగా వివరించాడు.

దటీజ్ రామ్ చరణ్.. 500 మంది కోసం చరణ్ ఉపాసన చేసిన పనికి వావ్ అనాల్సిందే

ఇక చరణ్ కూడా జానీ మాస్టర్ పట్ల చాలా గౌరవంగా ఉంటాడు. ఈ క్రమంలో జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడో అడిగిన సహాయాన్ని.. ఇచ్చిన మాటను గుర్తు ఉంచుకొని మరీ.. జానీ మాస్టర్ కు సహాయం చేసాడట. సరైన సమయంలో సహాయం చేసేవారు దేవుడు అంటూ జానీ మాస్టర్ తాజాగా ఈ పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచాడని.. వారికి నాపై ఉన్న ప్రేమకు నేను చాలా సంతోషించాను అంటూ వివరించాడు. అక్కడికి వెళ్లాక మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదంతో పాటు.. చరణ్ అన్న, ఉపాసన వదినలు తనకు ఇచ్చిన మాటకి.. వారు ఇచ్చిన సర్ప్రైజ్ కు నాకు సంతోషం కాస్త వెయ్యి రేట్లు పెరిగింది అంటూ జానీ మాస్టర్ వివరించాడు.

I will quit the industry if Satish can prove the allegations: Jani Master at Sensational Press Meet - IndustryHit.Com

తను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని తన డ్యాన్సర్ యూనియన్ టి.ఎఫ్, టి.టి.డిఏ లోని 500 పైగా కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా చెర్రీ, ఉపాసన జంట అండగా నిలబడతామని మాటిచ్చారట. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని మరి మాటకి విలువ ఇస్తూ అన్ని కుటుంబాలను చేరదీయడం సాధారణ విషయం కాదని.. చరణ్, ఉపాసనలపై ప్రశంసల వర్షం కురిపించాడు జానీ మాస్టర్. మనసులో కృతజ్ఞత భావం ఎప్పుడూ ఉంటుందని దండం ఇమోజీలను షేర్ చేస్తూ అందరు తరపున అన్న, వదినలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్న అని జానీ మాస్టర్ పోస్ట్‌ షేర్ చేశాడు. ఈ పోస్ట్ వైర‌ల్ అవ్వ‌డంతో మెగా అభిమానులు షాక్ అవుతున్నారు. చెర్రీ, ఉపాసన చేసిన మంచి పనికి ఫిదా అవుతున్నారు.