ప్రజెంట్ ప్రభాస్ ఫాన్స్ కి ఒళ్ళు మండిచ్చే న్యూస్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. ప్రభాస్ అంటే ఒక రెబల్ హీరో.. ఒక పాన్ ఇండియా హీరో ..బాహుబలి లాంటి బిగ్ బడా ప్రాజెక్టులో నటించి తన తలరాతను తానే మార్చేసుకున్న హీరో మరి అలాంటి హీరో చేత బోల్డ్ సీన్ చేయించాలి అని ఏ డైరెక్టర్ అనుకుంటారు ..? చాలావరకు ప్రభాస్ ని ట్రెడిషనల్ గానే చూపించాలి అనుకుంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ కోపం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే .
అయితే సందీప్ రెడ్డివంగా మాత్రం ఎవ్వరికి తలవంచడు ..లొంగడు.. ఆయన అనుకున్న కథను అనుకున్న విధంగా తెరకెక్కిస్తాడు. ముందుగానే ఆ విషయాలను సదరు హీరో హీరోయిన్లకి చెప్పేస్తాడు . ఒక అర్జున్ రెడ్డి ..ఒక యానిమల్ సినిమా చూసిన తర్వాత ఏ హీరో హీరోయిన్ కూడా సందీప్ రెడ్డి వంగాను నెగిటివ్గా మాట్లాడడానికి వేలెత్తి చూపించడానికి సాహసం చేయరు . ఆయన రాసుకున్న కథలు అంత రియలిస్టిక్ గా గా ఉంటాయి . ప్రజెంట్ ఇప్పుడు సందీప్ రెడ్డివంగా కు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. త్వరలోనే ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ .
అయితే ఈ సినిమాలో కూడా అర్జున్ రెడ్డి – అనిమల్ సినిమాలో ఉన్న లాగానే ఒక బోల్డ్ సీన్ ఉండబోతుందట. రొమాంటిక్ సీన్ అని చెప్పలేము కానీ ఒకానొక సందర్భంలో ప్రభాస్ ఒంటి మీద బట్టలు లేకుండా ఒక ఐదు సెకండ్ల పాటు చూపించబోతున్నారట. అయితే ప్రైవేట్ పార్ట్స్ బ్లర్ చేసి మరి ఇలా చూపించడానికి పెద్ద సాహసమే చేస్తున్నాడు సందీప్ రెడ్డివంగా అన్న వార్త వైరల్ అవుతుంది. నిజానికి అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోని కూడా అలాంటి సీన్ చూపించే సాహసం చేశాడు సందీప్ .అయితే ప్రభాస్ ని కూడా ముందుగానే ఈ విషయం కారణంగా రిక్వెస్ట్ చేశారట . ఆశ్చర్యం ఏంటంటే కథ నచ్చిన ప్రభాస్ అలా నటించడానికి ఓకే చేశారట . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగ డేర్ కు అభిమానులు షాక్ అయిపోతున్నారు..!!