మీ నాన్న బయోపిక్ మీరు తీస్తారా.. అభిమాని ప్రశ్నకు శృతిహాసన్ రిప్లై ఇదే..?!

లోకనాయకుడు కమల్ హాసన్ మల్టీ టాలెంటెడ్ హీరో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాత, రచయిత, గీత రచయిత ఇలా ఎన్నో ప్రతిభాలతో తన సత్తా చాటుకున్న కమల్.. నటవరసరాలుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది శృతిహాసన్. తాను కూడా తండ్రి లాగే మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంటుంది. నటి, గేయ రచయిత, గాయని, సంగీత దర్శకురాలీగా మంచి పేరు సంపాదించుకున్న శృతి.. తాజాగా ప్రైవేట్ ఆల్బమ్ కోసం ఇంగ్లీష్ పాటను రాయగా.. తండ్రి కమలహాసన్ దాన్ని తమిళ్లో అనువదించాడు.

Shruti Haasan on working with her DAD Kamal Hassan for the FIRST time |  India Forums

యెనిమోల్ పేరుతో రూపొందిన ఈ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్.. తాజాగా రిలీజై విశేష ఆదరణతో ఆకట్టుకుంది. నెటిజ‌న్లు కూడా ఈ ఆల్బమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో తాజాగా అభిమానులతో చిట్‌చాట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది శృతిహాసన్. ఇందులో భాగంగా ఓ నెటిజ‌న్‌ మీ తండ్రి కమల్ హాసన్ బయోపిక్ ను మీరు తెరకెక్కిస్తారా.. అని ప్రశ్నించగా దానికి షాకింగ్ కామెంట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. నెటిజ‌న్‌ ప్రశ్నకు స్పందిస్తూ దానికి అవకాశం లేదు అంటూ రిప్లై ఇచ్చింది.

தந்தையர் தினத்தில் சர்ப்ரைஸ் நியூஸ்.. கமல்ஹாசன் வாழ்க்கை வரலாற்றை  திரைப்படமாக எடுக்கும் ஸ்ருதிஹாசன்? | Actress Shruti Haasan Answers About  Directing Kamal Haasan ...

నా తండ్రి జీవిత చరిత్రను తీయాలంటే ఎంతో అవగాహన.. దానితో పాటు గట్స్‌ ఉండాలి.. దానికి నేను సరైన మనిషిని కాదు అంటూ ఆమె వివరించింది. ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రముఖ దర్శకులు ఉన్నారు. వాళ్లయితేనే నాన్న బయోపిక్ అద్భుతంగా తెర‌కెక్కించగలరు అంటూ శృతి వివరించింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లక్కీ బ్యూటీగా శృతిహాసన్ కొనసాగుతుంది. గతేడాది వాల్తేరు వీరయ్య, వీర‌సింహారెడ్డి, సలార్‌ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో సలార్ 2, డికాయిట్ సినిమాలతో పాటు.. తమిళ్లో చెన్నై స్టోరీస్ సినిమాలోని నటిస్తుంది.