నాకు, చరణ్ కి బాబాయి వల్లే తరచూ గొడవలు వచ్చేవి.. పవన్ కళ్యాణ్ పై సుస్మిత షాకింగ్ కామెంట్స్..?!

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మితకు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం కాస్ట్యూమ్ డిజైనర్ గా, ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పలు వెబ్ సిరీస్ లను, సినిమాలను నిర్మిస్తూ సక్సెస్‌ అందుకుంటున్న ఈ అమ్మడు.. తాజాగా పరువు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తోంది.

రామ్‌చరణ్‌, నా మధ్య గొడవ పెట్టి ఎంజాయ్‌ చేసేవాడు.. బాబాయ్‌ పవన్‌ గురించి  సుస్మిత ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

ప్రముఖ ఓటీటీ సంస్థ జి5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ సక్సెస్ టాక్ అందుకోవడంతో.. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది సుస్మిత. ఇందులో బాబాయ్ పవన్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను రివిల్ చేసింది. బాబాయ్ వల్ల‌ తనకు చరణ్ కు గొడవలు వచ్చేవని.. మా ఇద్దరికీ గొడవ పెట్టే సినిమా చూసినట్టు పవన్ బాబాయ్ చూస్తూ ఉండేవాడంటూ ఆమె వివరించింది. ఎప్పుడు మాతో సరదాగా ఉండే బాబాయ్ ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అవడం మాకు చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చింది.

Sushmita Konidela first Reaction on Deputy CM for Pawan Kalyan | Sushmita  Konidela: చరణ్‌కు.. నాకు గొడవపెట్టి ఆయన ఆనందించేవారు, పవన్ బాబాయ్ కాదు  అన్న: సుస్మితా కొణిదెల

ఆయన ప్రజల మనిషి.. వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడంటూ వివరించింది. ఇక మెగా ప్రిన్సెస్ క్లింకార‌ను ఎందుకు చూపించడం లేదు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. తన పాపను ఇప్పుడే అందరికీ చూపించాలని ఉపాసన, చరణ్ భావించడం లేదు. అది వాళ్ళ ఇష్టం అంటూ ఆమె వివరించింది.ఇక పరువు వెబ్ సిరీస్ విషయానికి వస్తే సిద్ధార్థ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకులుగా వ్యవహరించారు. నాగబాబు, నివేద పేతురాజ్‌, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి లాంటి వారు కీలకపాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో కొనసాగుతుంది.