శృతిహాసన్ ఆ అరుదైన వ్యాధితో బాధపడుతుందా.. షాకింగ్ విషయాన్ని రివిల్ చేసిన స్టార్ హీరోయిన్..?!

స్టార్ హీరో కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన‌ శృతిహాసన్ ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మ‌డు ఇటీవల నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో గోల్డెన్ లెగ్ బ్యూటీగా దూసుకుపోతున్న శృతి.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కేవలం హీరోయిన్ గానే కాదు.. సింగింగ్, డాన్సింగ్ ఇలా మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే.

Pic Talk: Sexy Shruti Haasan In Black

ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తర్వాత పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ అందుకుంది. తర్వాత ఈమె ఫేట్‌ మారిపోయింది. వరుస అవకాశాలను అందుకుంటూ బ్లాక్ బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఎన్టీఆర్, మహేష్, రామ్‌చ‌రణ్ లాంటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించిన‌ ఈ అమ్మడు చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్ హీరోల సరసన కూడా న‌టించి ఆకట్టుకుంది.

Shruti Haasan Admits To Plastic Surgery In Her Instagram Post | VOGUE India  | Vogue India

అయితే రీసెంట్గా ప్రభాస్ సరసన సలార్ లో నటించి పాన్ ఇండియన్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ‌కు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆమె ఓ అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతుందని సమాచారం. తనకి పిసిఓఎస్ సమస్య ఉందని.. దానితో ఆమె ఎంతో సఫర్ అవుతుందని.. శృతిహ‌స‌న్ ఇటీవల వివరించింది. తనకు బ్యాడ్ పీరియడ్ సమస్య ఉందంటూ చెప్పుకొచ్చింది.