మెగా హీరో మూవీ లో నటించే జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన ‘ బలగం ‘ బ్యూటీ.. ఆ స్టార్ హీరో మూవీలో కావ్య..?!

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే అలా టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిసిగా ఇంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తున్న వారిలో కావ్య కళ్యాణట్ రామ్ ఒకటి. ఈమె చైల్డ్ హుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా గంగోత్రితో మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్య.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలోను ఆక‌ట్టుకుంది. ఇక మసుద సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఈ సినిమాతో ఆమెకు ఊహించిన గుర్తింపు రాలేదు. తర్వాత‌ బలగం మూవీఛాన్స్ ద‌క్కించుక‌ని మంచి పాపులారిటీ దక్కించుకుంది కావ్య‌.

న‌టుడు, కామెడియ‌న్ వేణు యెల్దండి డైరెక్షన్లో తెరకెక్కిన బలగం మూవీలో కావ్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీతో అమ్మడి క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది. ఆడియ‌న్స్‌లో బలగం బ్యూటీ అనే ఇమేజ్ వ‌చ్చేసింది. బలగం తర్వాత ఉస్తాద్ సినిమాలో కావ్య నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన సక్సెస్ అందుకోలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చిన్నది ఓ మెగా హీరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది అంటూ తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు సాయి ధరంతేజ్.

Sai Dharam Tej multiple name changes: Will Stars smile? | cinejosh.com

వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తేజ్.. చివరిసారిగా బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఇప్పుడు గాంజా శంకర్ సినిమాలో ఆయన నటిస్తున్నాడు. తర్వాత రోహిత్ అనే కొత్త డైరెక్టర్ తో తేజ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ పెట్టనున్నారని టాక్. ఇక ఈ మూవీలో కావ్య కళ్యాణ్ రామ్ ను హీరోయిన్గా తీసుకున్నారని తెలుస్తోంది. ఇది నిజంగా బలగం బ్యూటీకి జాక్పాట్ ఆఫర్ అనే చెప్పాలి. త్వరలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ ప్రేక్షకుల‌ ముందుకు రానున్నాయి.