మహేష్ బాబు కి ఆ పొలిటికల్ పార్టీ అంటే అంత ఇష్టమా..? అలా జరుగుతుందని ముందే చెప్పాడా..?

మహేష్ బాబు కాంట్రవర్షియల్ విషయాలకు చాలా చాలా దూరంగా ఉండే హీరో .. అది అందరికీ తెలిసిందే. మహేష్ బాబు ఎంత జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడిన ఆయన మాట్లాడే మాటలను కొందరు తప్పుగా తీసుకుంటూ ఉంటారు . మరీ ముఖ్యంగా పొలిటికల్ పరంగా అస్సలు వేలు పెట్టని మహేష్ బాబు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ లో కూడా ఎవ్వరికీ సపోర్ట్ చేయని విషయం తెలిసిందే . మహేష్ బాబు చాలా చాలా సైలెంట్ ఎంతలా అంటే తన పని తాను చూసుకొని వెళ్ళిపోతాడు ..అవసరం ఉంటేనే ఆ విషయం జోలికి వెళ్తాడు .

కాగా రీసెంట్గా మహేష్ బాబుకు సంబంధించిన ఒక విషయం వైరల్ గా మారింది. మహేష్ బాబుకి పాలిటిక్స్ అంటే చాలా ఇష్టమట. కానీ పాలిటిక్స్ లో మాత్రం తలదూర్చకూడదు అనుకుంటూ ఉంటాడట. మహేష్ బాబుకి కాంగ్రెస్ పార్టీ అంటే చాలా చాలా ఇష్టం అంటూ గతంలో మహేష్ బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు ఓ సందర్భంలో చెప్పుకు వచ్చారు . తండ్రి కృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. అంతేకాదు గతంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచి ఒకసారి పార్లమెంట్ కి కూడా వెళ్ళాడు ..అయితే రెండోసారి ఓడిపోయాడు.

అంతేకాదు స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారితో కూడా కృష్ణకు మంచి సత్సంబంధాలు ఉండడం గమనార్హం . అంతేకాదు మహేష్ బాబుకు ఉన్న రాజకీయ టాలెంట్ చాలా సందర్భాలలో బయటపెట్టాడట. తెలంగాణలో జరిగిన రీసెంట్ ఎలక్షన్లో సీఎం గా రేవంత్ రెడ్డి గెలుస్తాడు అంటూ ముందుగానే ఊహించాడట . రేవంత్ స్పీచులను చూసి ఈసారి కాంగ్రెస్ తెలంగాణలో వస్తుంది అంటూ బాగా ధీమా వ్యక్తం చేశాడట . ఆయన అన్నట్టే నిజంగానే రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాడు. మహేష్ కి చాలా చాలా పొలిటికల్ టాలెంట్ ఉంది కానీ కొన్ని కారణాల చేత అయిన పొలిటికల్ పరంగా అడుగుపెట్టలేకపోతున్నాడు అంటున్నారు ఫ్యాన్స్..!!