ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. నాగ్ అశ్వీన్ కంటే ముందే ఒక డైరెక్టర్ కల్కి లాంటి కాన్సెప్ట్ తెరకెక్కించాలి అనుకున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . ఆ డైరెక్టర్ మరెవరో కాదు గుణశేఖర్ . తెలుగు ఇండస్ట్రీలో గుణశేఖర్ కి ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .
ఎన్నో ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక స్పెషల్ రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో గుణశేఖర్ తెరకెక్కించిన సినిమాలు ఏవి హిట్ కావడం లేదు . కానీ ఒకప్పుడు ఇలా చరిత్ర గురించి జనాలకు చెప్పే సినిమాలను ఆయన చాలానే తెరకెక్కించారు . అంతేకాదు ఇప్పుడు నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన కల్కి సినిమాను ఎప్పుడో ఆయన తరకెక్కించాలి అని ఆశపడ్డారట.
కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ తెరకెక్కించాలి అంటే భారీ బడ్జెట్ తో పాటు భారీ తారాగాణం కూడా అవసరం అని .. కానీ అప్పట్లో స్టార్స్ ఇలాంటి పిరియాడిక్ సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు అని .. ఆ కారణంగానే ఈ సినిమాను తెరకెక్కించలేకపోయారట . ఫైనల్లీ అలాంటి ఓ సాహసం చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్వీన్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది..!!