‘ కల్కి ‘ సీక్వెల్ టైటిల్ ఏంటో తెలిశా.. ఈ టైటిల్ వెనుక ఇంత లాజిక్ ఉందా..?!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడి కోసం ప్రభాస్ అభిమానుల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమలహాసన్ కీలకపాత్రలో నటించగా.. దీపికా పదుకొనే, దిశా పఠాని హీరోయిన్లుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతుంది. మొదటి షో నుంచే పాజిటివ్ దక్కించుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూంది.

మైథ‌లాజికల్ అండ్ సైన్స్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతి బ్యానర్స్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు అశ్విని దత్. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా హాలీవుడ్ విజువల్స్ ను మించి పోయే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విజువల్స్, కంటెంట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. కాగా కల్కి సీక్వెల్ టైటిల్ కల్కి 3012 బీసీ అని టాక్ నడుస్తుంది. శ్రీకృష్ణుడు మానవ శరీరాన్ని వీడిన సంవత్సరం అదే కావడంతో మేకర్స్ ఆ టైటిల్ ఫిక్స్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

నాగ్ అశ్విన్‌కు ఒక అభిమాని ఈ టైటిల్ సూచించగా అశ్విన్‌ దానిపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. కాగా అశ్విన్‌ దర్శకుడుగా ఈ సినిమాతో ఒక్కసారిగా ఎన్నో మెట్లు ఎక్కాడు. సినిమా రిలీజై ప్రేక్షకులు ముందుకు వచ్చేవరకు నాగ్ అశ్విన్‌కు ఇంత టాలెంట్ ఉందని అసలు ఊహించలేదంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ముందు ముందు కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి. అలాగే సినిమా సీక్వెల్ కూడా త్వరలోనే సెట్స్‌ పైకి రానుందట.