నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆరుపదల వయసులోనే యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సక్సెస్ అందుకుంటున్న బాలయ్య.. చివరిగా వచ్చిన భగవంత్ కేసరి తో హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ సీనియర్ హీరోల అందరిలో టాప్ పొజిషన్లో దూసుకుపోతున్న బాలయ్య.. తన 109వ సినిమాను బాబి డైరెక్షన్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్‌బికె 109 రన్నింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు ఊర్వశీ రౌతెలా, బాబి డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సాలిడ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత తాజాగా మొదలైంది. ఇక ఇప్పుడు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా.. గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాకి మొదట వీరమాస్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి.
అయితే అది కాకుండా ఇప్పుడు మరో టైటిల్ ఫిక్స్ అయిందంటూ తెలుస్తుంది. గ్లింప్స్ లో చెప్పిన విధంగా అసురుని తరహాలో ఉండే ఒక డిఫరెంట్ పవర్ఫుల్ టైటిల్ పెట్టె ప్రయత్నంలో ఉన్నారట మేకర్స్. ఈ క్రమంలో ” డెమోన్ ” అనే టైటిల్ బాగుంటుందని చర్చలు జరుగుతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ అవ్వడంతో టైటిలే భలే పవర్ ఫుల్ గా ఉందే అంటూ.. ఈ సినిమాతో బాలయ్య మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.