టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. ప్రభాస్‌తో తెరకెక్కించిన బాహుబలితో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అవార్డును దక్కించుకుని తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించాడు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్న జక్కన్న.. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పాడు ఈ క్రమంలో రాజమౌళితన నెక్స్ట్ మూవీ హీరో ఎవరు అనేదానిపై మంచి హింట్ ఇచ్చేశాడంటూ నటింట ఒ న్యూస్ తాగ వైరల్ అవుతుంది. ఇంతకీ తన నెక్స్ట్ మూవీ హీరో ఎవరు.. అసలు ఆ హింట్ ఎంటో ఒకసారి తెలుసుకుందాం.
రెబల్ స్టార్ట్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898ఏడి సినిమాలో రాజమౌళి గెస్ట్ రోల్‌లో నటిస్తున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారం చివరకు నిజమైంది. కల్కి మూవీ సెకండ్ హాఫ్ లో జక్కన్న షాకింగ్ రోల్‌ల్లో కనిపించి మెప్పిస్తాడు. ఆ టైంలో ప్రభాస్ ఛాన్స్ ఇస్తే 5 ఏళ్ళు తీసుకున్నావ్ అని చెప్పగా.. ఈసారి దొరికితే పదేళ్లు తొక్కేస్తా అంటూ వివరిస్తాడు. ఈ విధంగా ప్రభాస్ తో మరోసారి సినిమాను జక్కన్న ఫిక్స్ చేశారని.. నెటింట కామెంట్లు వినపడుతున్నాయి. ఇక ప్రభాస్, రాజమౌళి కాంబోలో మహాభారతం తెరకెక్కనుందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ తో సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేస్తాడని టక్.
దీని హింటే ప్రభాస్ కల్కి మూవీలో రాజమౌళి చెప్పిన ఆ డైలాగ్ అంటూ నెట్టింట జక్కన వీడియో తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఫ్యూచర్ లో మరోసారి వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా కూడా అదే రేంజ్ లో బ్లాస్ట్ అవుతుంది అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్, రాజమౌళి కాంబోలో సినిమా తెరకెక్కితే ఆ సినిమా ఖచ్చితంగా బాహుబలి 2 మించి పోయే లెవెల్ లో ఉంటుందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి నిజంగానే త్వరలో వీరిద్దరు కాంబో మూవీ పై కూడా అధికారక ప్రకటన ఇస్తే బాగుండు అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం రమ్యనరేషన్ కూడా ఒకింత భారీ లెవెల్ లోనే ఉందన్న సంగతి తెలిసిందే. ఇక రోజు రోజుకు వీరిద్దరిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.