‘ కల్కి ‘ సినిమాతో దర్శకుడు సంచలనం సృష్టించిన నాగ అశ్విన్.. ఇన్ని సినిమాల్లో నటించాడా.. ఆ లిస్టు ఇదే..?!

పాన్ ఇండియ‌న్ స్టార్ట్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి తాజాగా రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అన్నిచోట్ల మంచి రెస్పాన్స్ అందుకుంటూ కలెక్షన్ల పరంగా మరిన్ని రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైన ఈ సినిమాకు.. నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి మంచి గుర్తింపును తెచ్చుకున్న నాగ అశ్విన్‌కు.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రశంసలు దక్కుతున్నాయి.

Is that Nag Ashwin in Leader? : r/tollywood

అయితే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్‌ఖు పరిచయమైన అశ్విన్ ఈ సినిమా తర్వాత.. మహానటి, కల్కి సినిమాలను తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ స‌క్స‌స్‌ను అందుకున్నాడు. అయితే దర్శకుడుగా మారకముందు నాగ్ అశ్విన్‌.. ఎంతోమంది స్టార్ డైరెక్టర్‌ల‌ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఆయ‌న పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

Nag Ashwin: ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ సినిమాలో నటించాడని మీకు  తెలుసా.. - Telugu News | Did you know that director Nag Ashwin acted in the  movie Life is Beautiful.. | TV9 Telugu

డైరెక్టర్‌గా మారకముందు మంచు మనోజ్ హీరోగా నటించిన నేను మీకు తెలుసా..? సినిమాతో పాటు.. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ లీడర్ ‘,  ‘ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ‘ సినిమాల్లోనూ చిన్న పాత్రల్లో నటించాడు. శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి తరువాత దర్శకత్వంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తన మొదటి మూడు సినిమాలతోనే టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లిస్టులో నాగ్ అశ్విన్‌ పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది.